Telugu Global
Others

ఆ రేసులో లేనంటున్న ఎర్ర‌బెల్లి

టీటీడీపీలో కీల‌క నేత ఎర్ర‌బెల్లి అలిగారా? త‌న‌కు టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌ద‌ని తెలుసుకుని ఇదే సాకుతో పార్టీని వీడ‌నున్నారా? ఇంత‌కీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నిక‌వుతారు? బాబు మ‌దిలో ఏముంది? నొప్పింప‌క తానొవ్వ‌క కాగ‌ల కార్యాన్ని ఐవీఆర్ ఎస్‌ కు అప్ప‌గించ‌డం వెనుక కార‌ణాలేంటి? అనే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు మాత్రం ముమ్మాటికీ టీటీడీపీలో గ్రూపు త‌గాదాలేన‌ని కేడ‌ర్ చెబుతోంది. తెలంగాణ‌లో తెలుగుదేశానికి పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు చంద్ర‌బాబు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. అయితే […]

ఆ రేసులో లేనంటున్న ఎర్ర‌బెల్లి
X

టీటీడీపీలో కీల‌క నేత ఎర్ర‌బెల్లి అలిగారా? త‌న‌కు టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌ద‌ని తెలుసుకుని ఇదే సాకుతో పార్టీని వీడ‌నున్నారా? ఇంత‌కీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నిక‌వుతారు? బాబు మ‌దిలో ఏముంది? నొప్పింప‌క తానొవ్వ‌క కాగ‌ల కార్యాన్ని ఐవీఆర్ ఎస్‌ కు అప్ప‌గించ‌డం వెనుక కార‌ణాలేంటి? అనే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు మాత్రం ముమ్మాటికీ టీటీడీపీలో గ్రూపు త‌గాదాలేన‌ని కేడ‌ర్ చెబుతోంది. తెలంగాణ‌లో తెలుగుదేశానికి పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు చంద్ర‌బాబు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. అయితే ముందు కార్య‌వ‌ర్గం ఎంపిక చేయాల‌ని నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదే విష‌యాన్ని ఈ మ‌ధ్య విజ‌య‌వాడ‌లో క‌లిసిన నేత‌లు బాబుకు విన్న‌వించారు. అయితే అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోకి చాలా మందే వ‌చ్చారు. దీంతో బాబు ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్ట‌మ్ ద్వారా టీడీపీ క్రియాశీల కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం మేర‌కు అధ్య‌క్షుడిని ఎంపిక చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అలిగార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ను కాద‌ని త‌న‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌ని ఆశించిన ఎర్ర‌బెల్లి అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని, పార్టీని వీడే అవ‌కాశాలున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే అస‌లు తాను అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోనే లేన‌ని ఎర్ర‌బెల్లి స్ప‌ష్టం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేస్తారన్నారు. ఆయన ఎవరిని ఎంపిక చేసినప్పటికీ తన సహకారం ఉంటుందని ఎర్రబెల్లి చెప్పారు. అయితే అధ్య‌క్ష ప‌ద‌విపై ఆశ‌ప‌డిన ఎర్ర‌బెల్లి.. అది అంద‌క‌పోవ‌డం, త‌న‌కు పార్టీలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న రేవంత్‌కు పార్టీ ప‌గ్గాల‌ప్ప‌గిస్తే…యువ‌నాయకుడి కింద ప‌నిచేయ‌డం ఇష్టంలేని ఎర్ర‌బెల్లి.. గులాబీ గూటికి చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

First Published:  20 Sept 2015 8:02 AM IST
Next Story