Telugu Global
Others

ఉండ‌వ‌ల్లిపై మార్గ‌ద‌ర్శి ప‌రువున‌ష్టం కేసుపై హైకోర్టు స్టే

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై మార్గదర్శి చిట్ ఫండ్స్ దాఖలు చేసిన పరువునష్టం కేసు తదుపరి విచారణపై హైకోర్టు శనివారం స్టే విధించింది. తదుప‌రి ఆదేశాల ఇచ్చేవ‌ర‌కూ కేసు య‌థాత‌థ స్థితిలో ఉంటుంద‌ని కోర్టు పేర్కొంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  2007లో త‌మ సంస్థ‌, య‌జ‌మాని రామోజీరావు ప‌రువుకు న‌ష్టం క‌లిగించే విధంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిటీ సివిల్ కోర్టులో మార్గదర్శి యాజమాన్యం కేసు […]

ఉండ‌వ‌ల్లిపై మార్గ‌ద‌ర్శి ప‌రువున‌ష్టం కేసుపై హైకోర్టు స్టే
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై మార్గదర్శి చిట్ ఫండ్స్ దాఖలు చేసిన పరువునష్టం కేసు తదుపరి విచారణపై హైకోర్టు శనివారం స్టే విధించింది. తదుప‌రి ఆదేశాల ఇచ్చేవ‌ర‌కూ కేసు య‌థాత‌థ స్థితిలో ఉంటుంద‌ని కోర్టు పేర్కొంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2007లో త‌మ సంస్థ‌, య‌జ‌మాని రామోజీరావు ప‌రువుకు న‌ష్టం క‌లిగించే విధంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సిటీ సివిల్ కోర్టులో మార్గదర్శి యాజమాన్యం కేసు దాఖలు చేసింది. రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిష‌న్‌లో కోరింది. దీనిపై ఉండ‌వ‌ల్లి హైకోర్టును ఆశ్ర‌యించారు. తాను హైకోర్టులో దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అనుమతించారని, హైకోర్టులో రివిజన్ పెండింగ్‌లో ఉండగా, కింది కోర్టు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించరాదని ఉండవల్లి హైకోర్టును కోరారు. దీనిపై వాద‌ప్ర‌తివాద‌న‌లు విన్న కోర్టు స్టే మంజూరు చేసింది.

First Published:  20 Sept 2015 7:27 AM IST
Next Story