మిడ్‌మానేరు బాధితులకు వచ్చేనెలలోపు పరిహారం
కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు రిజర్వాయర్ భూసేకరణ, పునరావాసం కోసం రూ.250 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని వారు వివరించారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యల పరిష్కారంపై మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిడ్ మానేరు బాధితుల్లో ఈ యేడాది జనవరి నాటికి 18 సంవత్సరాలు […]
కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు రిజర్వాయర్ భూసేకరణ, పునరావాసం కోసం రూ.250 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని వారు వివరించారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యల పరిష్కారంపై మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిడ్ మానేరు బాధితుల్లో ఈ యేడాది జనవరి నాటికి 18 సంవత్సరాలు దాటిన వారికి రూ.రెండు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలను వచ్చేనెలాఖరులోపు అమలు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద వంద రోజుల పని దినాలకుగాను కూలీ రోజుకు రూ.100 నుంచి రూ.180 పెంచాలని మంత్రులు అధికారులతో స్పష్టం చేశారు. అలాగే ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలకు త్రీఫేస్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. సిరిసిల్లలో అర్బన్ భూములు సుమారు 423 ఎకరాలను జీవో 123 ప్రకారం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.