గ్రేటర్‌లో 27 లక్షల ఓట్లకు ఎసరు?
జంటనగరాల్లో 27లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారా? వీరిలో చాలామంది ఆంధ్ర్ర ప్రాంతానికి చెందిన వారనే విషయం రాజకీయపార్టీలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ఓటర్ల లక్ష్యంగానే ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతోంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 27, 12, 468 మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి […]
BY admin20 Sept 2015 3:11 PM IST
X
admin Updated On: 20 Sept 2015 3:11 PM IST
జంటనగరాల్లో 27లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారా? వీరిలో చాలామంది ఆంధ్ర్ర ప్రాంతానికి చెందిన వారనే విషయం రాజకీయపార్టీలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ఓటర్ల లక్ష్యంగానే ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతోంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 27, 12, 468 మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్లోనే ఏకంగా 1,21,085 ఓట్లను తొలగించారు. కాంగ్రెస్, తెదేపా, బీజేపీలకి మంచి పట్టున్న ప్రాంతాలయిన ఖైరతాబాద్, ఉప్పల్, అమీర్‌పేట్, బాలానగర్, సనత్‌నగర్, దిల్‌షుక్‌నగర్ తదితర ప్రాంతాలలో ఈ ఓటర్ల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాలలో ఓట్లు ఉన్నవారు, స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపలేనివారు, ఇళ్ళకు తాళాలు వేసున్నవారికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన గడువులోగా స్పందించనివారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమిషనర్ తెలిపారు. సరయిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతామని చెపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెరాస పోటీ చేసి గెలవలేకనే జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను రద్దు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్ పిర్యాదు చేసింది. మిగిలిన పార్టీలు కూడా అదే దారిలో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆంధ్రప్రాంతంలో ఉండేవారిని ఇక్కడ ఓటర్లుగా చేర్చినట్టు తమకు సమాచారం ఉందని, వీరికి ఆ ప్రాంతంతోపాటు ఇక్కడ కూడా ఓట్లు ఉన్నందువల్లే వాటిని దొంగ ఓట్లుగా పరిగణించి తొలగిస్తున్నామని టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు చెబుతున్నారు.
Next Story