Telugu Global
Others

ఏపీ ట్రెజరీలో నిధులు ఖాళీ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద నిధులు లేనట్టే కనిపిస్తోంది. ఆర్ధిక కష్టాలతో అవసరమైన పనులకు కూడా నిధులు విడుదల చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి. చివరకు ఇపుడు బిల్లులకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వం ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిధులు అసలు లేకపోతే విడుదల చేసే సమస్యే ఉత్పన్నం కాదు కదా అనుకోవచ్చు. కాని అత్యవసరాలకు మాత్రమే నిధులు విడుదల చేసి మిగిలిన బిల్లులను పక్కన పెట్టాలని […]

ఏపీ ట్రెజరీలో నిధులు ఖాళీ!
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద నిధులు లేనట్టే కనిపిస్తోంది. ఆర్ధిక కష్టాలతో అవసరమైన పనులకు కూడా నిధులు విడుదల చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి. చివరకు ఇపుడు బిల్లులకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వం ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిధులు అసలు లేకపోతే విడుదల చేసే సమస్యే ఉత్పన్నం కాదు కదా అనుకోవచ్చు. కాని అత్యవసరాలకు మాత్రమే నిధులు విడుదల చేసి మిగిలిన బిల్లులను పక్కన పెట్టాలని ప్రభుత్వ ఆదేశాల సారాంశం. అయితే ఒక వెసులుబాటు కల్పించింది. అదేమిటంటే… సెప్టెంబర్‌ 8వ తేదీలోపు ట్రెజరీలకు వచ్చిన బిల్లులను మాత్రమే ఆమోదించి మిగిలిన వాటిని పెండింగ్‌లో పెట్టాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దీన్ని పాటించాలని ట్రెజరీలకు ఆర్థికశాఖ ఆదేశించింది.
First Published:  20 Sept 2015 6:05 AM IST
Next Story