9 మంది కబడ్డీ ప్లేయర్లు దుర్మరణం
ఆటలో గెలిచారు. విధి ముందు మాత్రం ఓడిపోయారు. ఎంతో ఆనందంగా కబడ్డీ ఆడడానికి వెళ్ళిన వారు గెలిచి సంతోషంగా తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. మొత్తం తొమ్మిది మంది కబడ్డీ క్రీడాకారులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన ఒడిషాలోని సందర్‌ఘడ్ జిల్లా బరాయి ప్రాంతంలో జరిగింది. వీరంతా ఒడిషాలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వెళ్ళారు. ఆటలో గెలుపొందిన వీరంతా ఆనందోత్సాహాలతో తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. సరిగ్గా ఈ […]
BY sarvi20 Sept 2015 7:10 AM IST

X
sarvi Updated On: 20 Sept 2015 7:10 AM IST
ఆటలో గెలిచారు. విధి ముందు మాత్రం ఓడిపోయారు. ఎంతో ఆనందంగా కబడ్డీ ఆడడానికి వెళ్ళిన వారు గెలిచి సంతోషంగా తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. మొత్తం తొమ్మిది మంది కబడ్డీ క్రీడాకారులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన ఒడిషాలోని సందర్‌ఘడ్ జిల్లా బరాయి ప్రాంతంలో జరిగింది. వీరంతా ఒడిషాలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వెళ్ళారు. ఆటలో గెలుపొందిన వీరంతా ఆనందోత్సాహాలతో తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. మృతుల బంధువులంతా శోకతప్త హృదయాలతో ఉండండంతో ఆటగాళ్ళ స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story