Telugu Global
Others

పాతబస్తీపై దృష్టి సారించిన పోలీసులు

వినాయక చవితిని పురస్కరించుకుని పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అప్రమత్తమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్‌ నుంచి కవాతు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారమున్న శాలిబండ, బంగారు మైసమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిపురా మార్కెట్‌, మొగల్‌పురా పోలీస్‌స్టేషన్‌, వాల్టా హోటల్‌, చౌక్‌మైదాన్‌, సర్దార్‌ మహల్‌ ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తూ చివరికి తిరిగి చార్మినార్‌కు చేరుకున్నారు. వినాయక మండపాలున్నచోట ఎలాంటి ఇబ్బంది కలగకుండా […]

వినాయక చవితిని పురస్కరించుకుని పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అప్రమత్తమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్‌ నుంచి కవాతు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారమున్న శాలిబండ, బంగారు మైసమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిపురా మార్కెట్‌, మొగల్‌పురా పోలీస్‌స్టేషన్‌, వాల్టా హోటల్‌, చౌక్‌మైదాన్‌, సర్దార్‌ మహల్‌ ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తూ చివరికి తిరిగి చార్మినార్‌కు చేరుకున్నారు. వినాయక మండపాలున్నచోట ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాతబస్తీ నాయకులను అప్రమత్తం చేశారు. దక్షిణమండలం డీసీపీ వి. సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీ బాబురావు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, తెలంగాణ స్పెషల్‌ పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు.
First Published:  18 Sept 2015 1:06 PM GMT
Next Story