అతను ఫ్లై ఓవర్ పై నుండి దూకాడు...వాళ్లు క్యాచ్ పట్టారు!
పుణెలో ముగ్గురు పోలీసులు చక్కని సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. గత మంగళవారం నాడు బహుసాహెబ్ వాకడ్కర్ అనే 65ఏళ్ల పెద్దమనిషి హింజెవాడీ వాకడ్ ఫ్లై ఓవర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ చిమ్నాజీ కేంద్రే, కానిస్టేబుళ్లు ప్రకాష్ మోరే, మహేష్ కాంబ్లి ఫ్లై ఓవర్ కిందనుండి వెళుతున్నారు. బహుసాహెబ్ ముప్పయి అడుగుల ఎత్తున్న ఫ్లై ఓవర్ అంచుల్లో నిలబడి ఉండటం వారు గమనించారు. అతను ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడని అర్థమైంది. ఎలాగైనా అతడిని ఆపాలని అనుకున్నారు. ఇద్దరు […]
పుణెలో ముగ్గురు పోలీసులు చక్కని సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. గత మంగళవారం నాడు బహుసాహెబ్ వాకడ్కర్ అనే 65ఏళ్ల పెద్దమనిషి హింజెవాడీ వాకడ్ ఫ్లై ఓవర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ చిమ్నాజీ కేంద్రే, కానిస్టేబుళ్లు ప్రకాష్ మోరే, మహేష్ కాంబ్లి ఫ్లై ఓవర్ కిందనుండి వెళుతున్నారు. బహుసాహెబ్ ముప్పయి అడుగుల ఎత్తున్న ఫ్లై ఓవర్ అంచుల్లో నిలబడి ఉండటం వారు గమనించారు. అతను ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడని అర్థమైంది. ఎలాగైనా అతడిని ఆపాలని అనుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని మాటల్లో పెట్టేందుకు ప్రయత్నించారు. చిమ్నాజీ రోడ్డు కింద ఉన్న ట్రాఫిక్‌ని నియంత్రించి ముందుకు వెళ్లాలని చూశాడు. ఈ లోపల పైనున్న వ్యక్తికి ఆ ముగ్గురు తనని ఆపుతున్నారని అర్థమైంది. అంతే… వెంటనే పై నుండి కిందకి దూకేశాడు.
అతని ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న చిమ్నాజీ కూడా వెనక్కి వచ్చేశాడు. ముగ్గు రూ కలిసి సరిగ్గా అతను పడబోతున్న ప్రదేశంలో నిలబడి కిందపడకుండా క్యాచ్ పట్టారు. వాళ్ల చాకచక్యం కారణంగా కాలుకి చిన్న ఫ్రాక్చర్‌తో అతను బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పెద్దాయన మీద కేసుపెట్టబోయిన తోటి పోలీసులను ఆ ముగ్గురు నివారించారు. అతను వృద్ధుడు కావడం వలన కేసు వద్దపెట్టవద్దని వారు కోరారని హింజెవాడీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున్న ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడనే విషయాన్ని పోలీసులు ఇంకా అడగలేదు. మొత్తానికి ఒక ప్రాణాన్ని కాపాడిన ఆ ముగ్గురి సమయస్ఫూర్తి అభినందించదగినది.