రెవిన్యూ మంత్రి టార్గెట్‌గా చంద్రబాబు వ్యాఖ్యలు!
రెవిన్యూ మంత్రి కె.ఈ. కృష్ణమూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. ఏ కుక్కనైనా చంపాలనుకున్నప్పుడు దానికి పిచ్చి ఉందని ముందు ప్రచారం చేయడం పరిపాటి. ఒకవేళ తర్వాత దాన్ని చంపినా ఎవరికీ దానిపై సానుభూతి లేకుండా చేయడం ఈ ప్రచారం ఉద్దేశ్యం. సరిగ్గా ఇలాంటి పోకడలే కనిపిస్తున్నాయి రెవిన్యూ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి పట్ట చంద్రబాబు వ్యవహారశైలి. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో కూడా రెవిన్యూ మంత్రిని వదిలినట్టు కనిపించలేదు. ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించకుండా ఈసారి […]
BY sarvi19 Sept 2015 7:06 AM IST
X
sarvi Updated On: 19 Sept 2015 7:06 AM IST
రెవిన్యూ మంత్రి కె.ఈ. కృష్ణమూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. ఏ కుక్కనైనా చంపాలనుకున్నప్పుడు దానికి పిచ్చి ఉందని ముందు ప్రచారం చేయడం పరిపాటి. ఒకవేళ తర్వాత దాన్ని చంపినా ఎవరికీ దానిపై సానుభూతి లేకుండా చేయడం ఈ ప్రచారం ఉద్దేశ్యం. సరిగ్గా ఇలాంటి పోకడలే కనిపిస్తున్నాయి రెవిన్యూ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి పట్ట చంద్రబాబు వ్యవహారశైలి. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో కూడా రెవిన్యూ మంత్రిని వదిలినట్టు కనిపించలేదు. ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించకుండా ఈసారి ఆయన నిర్వహిస్తున్న శాఖపై చంద్రబాబు పడ్డారు.
‘రెవెన్యూపై అవినీతి ముద్ర ఉంది. కొన్ని శాఖల్లో అభివృద్ధి రెండంకెల్లో ఉంది. కానీ రెవెన్యూలో మాత్రం రెండంకెల్లో అవినీతి ఉంది’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని, అలసత్వాన్ని దూరం చేసేందుకు ప్రతి శాఖకూ ఓ కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వీటి ద్వారా అందరికీ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందోగాని మంత్రుల అధికారాలకు మాత్రం కొంత కత్తెర పడడం ఖాయం. ఇసుక విధానాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకోవాలని, దానిలోని లోపాల వల్ల చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు చెప్పారు. లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీల విషయంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. రాజుల సమయంలో రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు వేగులుండేవారని, ఇప్పుడు కలెక్టర్లు కూడా ఇంటెలిజెన్స్, ఐ అండ్ పీఆర్, లా అండ్ ఆర్డర్‌లను ఉపయోగించుకోవాలని వ్యాఖ్యానించడం ద్వారా మంత్రుల అధికారులకు కత్తెరేయాలని చూస్తున్నట్టుంది చంద్రబాబు తీరు.
Next Story