పాటతో మొదలైన బ్రహ్మోత్సవం
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మహేష్, వెంటనే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ లో వాలిపోయాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో ప్రస్తుతం సంగీత్ పాట చిత్రీకరిస్తున్నారు. మహేష్ తోపాటు హీరోయిన్ సమంత, ప్రణీత ఇందులో పాల్గొంటున్నారు. వీళ్లతో పాటు నటీనటులు దాదాపు 21 మంది ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. […]
BY admin19 Sept 2015 3:30 AM IST

X
admin Updated On: 19 Sept 2015 8:00 AM IST
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మహేష్, వెంటనే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ లో వాలిపోయాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో ప్రస్తుతం సంగీత్ పాట చిత్రీకరిస్తున్నారు. మహేష్ తోపాటు హీరోయిన్ సమంత, ప్రణీత ఇందులో పాల్గొంటున్నారు. వీళ్లతో పాటు నటీనటులు దాదాపు 21 మంది ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. పీవీపీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు. శ్రీమంతుడు లాంటి సూపర్ సక్సెస్ తర్వాత ఎన్నో కథలు విని, ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఫిక్స్ అయ్యాడు మహేష్.
Next Story