Telugu Global
Others

Wonder World 30

ముంబైలో కదిలే హోటల్‌! కదిలే బస్సులో భోంచేయడమంటే ఎలా ఉంటుంది? అదీ అరేబియా ఒడ్డున ప్రయాణిస్తూ అందాలను ఆస్వాదిస్తూ భోజనమో, అల్పాహారమో తీసుకోవడం ఎలాంటి అనుభూతినిస్తుంది? ఓహ్‌… ఊహల్లో తేలిపోతున్నారా.. అయితే మీరు ఒక్కసారి ముంబై వెళ్లాల్సిందే. ఇలాంటి సదుపాయాలను కల్పిస్తూ ఇటీవలే ఓ డబుల్‌డెక్కర్‌ బస్సు సర్వీసు ప్రారంభమయ్యింది. ‘మెరైన్‌ డ్రైవ్‌’ పేరుగల ఈ బస్సును చెన్నైకి చెందిన ప్రయివేటు కంపెనీ ‘మూవింగ్‌ కార్ట్‌’ ప్రారంభించింది. ముంబై వీధుల్లో విహరిస్తూ మనకు ఇష్టమైన వంటకాల రుచులను […]

Wonder World 30
X

ముంబైలో కదిలే హోటల్‌!

move hotel

కదిలే బస్సులో భోంచేయడమంటే ఎలా ఉంటుంది? అదీ అరేబియా ఒడ్డున ప్రయాణిస్తూ అందాలను ఆస్వాదిస్తూ భోజనమో, అల్పాహారమో తీసుకోవడం ఎలాంటి అనుభూతినిస్తుంది? ఓహ్‌… ఊహల్లో తేలిపోతున్నారా.. అయితే మీరు ఒక్కసారి ముంబై వెళ్లాల్సిందే. ఇలాంటి సదుపాయాలను కల్పిస్తూ ఇటీవలే ఓ డబుల్‌డెక్కర్‌ బస్సు సర్వీసు ప్రారంభమయ్యింది. ‘మెరైన్‌ డ్రైవ్‌’ పేరుగల ఈ బస్సును చెన్నైకి చెందిన ప్రయివేటు కంపెనీ ‘మూవింగ్‌ కార్ట్‌’ ప్రారంభించింది. ముంబై వీధుల్లో విహరిస్తూ మనకు ఇష్టమైన వంటకాల రుచులను ఆస్వాదించే అవకాశం కల్పించడం ఈ బస్సు ప్రత్యేకత. ఈ ప్రయాణంలో భాగంగా ముంబై సముద్ర తీరంలోనూ నాలుగు కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణిస్తుంది. అరేబియా సముద్ర తీరంలోని నేతాజీ సుబాష్‌ చంద్ర రోడ్డులో ప్రయాణం ప్రారంభమౌతుంది.. రోజుకు మూడు ట్రిప్పులు వేస్తున్నారు. ఈ బస్సులో ప్రస్తుతానికి 12 రకాల వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి బస్సు ఒకటి ఇప్పటికే చెన్నై వీథుల్లో సేవలందిస్తోందని కంపెనీ సహ సంస్థాపకుడు హార్దిక్‌ షా చెప్పారు. ఆహారపదార్ధాలను బస్సులో అప్పటికప్పుడు వండివార్చే అవకాశం లేదు. సమీపంలోని ఓ ప్రముఖ హోటల్‌ నుంచి వాటిని తీసుకువస్తారు. వేడిచేసి కస్టమర్లకు సరఫరా చేస్తారు. ఈ బస్సులో సేవలందుకోవాలంటే రోడ్డుపక్కన నిలబడి చేయి ఊపితే కుదరదు. ముందుగా ఆన్‌లైన్‌లో మన సీట్లను రిజర్వ్‌ చేసుకోవలసి ఉంటుంది. ఒకో అంతస్తులో 20 మంది కూర్చుని భోంచేసేందుకు సదుపాయముంది. కింది అంతస్తు పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌ కాగా పై అంతస్తులో ఓపెన్‌ ఎయిర్‌ సదుపాయముంది. మనకు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. బస్సును ఇలా మూవింగ్‌ హోటల్‌గా మార్చడానికి, అవసరమైన అనుమతులు తీసుకోవడానికి మొత్తంగా కోటిరూపాయల వరకూ ఖర్చయిందని షా చెప్పారు. ప్రస్తుతానికి బస్సులో ఆల్కహాల్‌ సరఫరా చేయడం లేదని ఆయన తెలిపారు. అయితే అందుకోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాగానే ఆ సదుపాయమూ అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బస్సులో భోంచేయాలంటే వెజిటేరియన్‌ భోజనం రు.1200, నాన్‌వెజిటేరియన్‌ భోజనం రు.1400 ఖర్చవుతుంది. ప్లేట్‌మీల్స్‌ సదుపాయం లేదు. మనం ఎంత తినగలిగితే అంత తినవచ్చు.

First Published:  17 Sept 2015 6:34 PM IST
Next Story