మాంసం విక్రయాల నిషేధం సరికాదు: సుప్రీం
మహారాష్ర్టలో మాంసం విక్రయాలపై విధించిన నిషేధంపై నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. జైనుల పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు ముంబైలో మాంసం అమ్మకాల విక్రయాన్ని నిషేధిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ మాంసం విక్రయదారులు మహారాష్ర్ట హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కార్పొరేషన్ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ముంబై హై కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ జైన మతానికి చెందిన ఓ ట్రస్టు సుప్రీంను […]
BY sarvi18 Sept 2015 5:27 AM IST
X
sarvi Updated On: 18 Sept 2015 9:05 AM IST
మహారాష్ర్టలో మాంసం విక్రయాలపై విధించిన నిషేధంపై నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. జైనుల పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు ముంబైలో మాంసం అమ్మకాల విక్రయాన్ని నిషేధిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ మాంసం విక్రయదారులు మహారాష్ర్ట హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కార్పొరేషన్ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ముంబై హై కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ జైన మతానికి చెందిన ఓ ట్రస్టు సుప్రీంను ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక మతం కోసం ఇతర మతస్తులు ఇబ్బందులు పడటం సమంజసం కాదని, పరమత సహనం అంటే.. ఇతర మతస్తులకు ఇబ్బందులు కలిగించడం కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విధించిన స్టేను ఎత్తివేయాలని ముంబై హైకోర్టుకు తాము సూచించలేమని స్పష్టం చేసింది.
Next Story