పాక్ కాల్పుల్లో మత్స్యకారుడు మృతి
గుజరాత్ తీరంలో ఓ మత్స్యకారుడ్ని పాకిస్థాన్ తీర గస్తీదళం కాల్చి చంపింది. చేపలు పడుతున్న సమయంలో ఇతన్ని పాక్ దళం కాల్చి చంపిందని స్థానిక మత్స్యకారులు కూడా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారతీయ తీర గస్తీదళం సంఘటన స్థలికి వెళ్ళింది. ఈ విషయమై ప్రశ్నించగా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎలా జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడలేమని భారతీయ గస్తీదళం అధికారులు చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. పడవపై మత్స్యకారుడు […]
BY sarvi18 Sept 2015 11:28 AM IST
X
sarvi Updated On: 18 Sept 2015 11:32 AM IST
గుజరాత్ తీరంలో ఓ మత్స్యకారుడ్ని పాకిస్థాన్ తీర గస్తీదళం కాల్చి చంపింది. చేపలు పడుతున్న సమయంలో ఇతన్ని పాక్ దళం కాల్చి చంపిందని స్థానిక మత్స్యకారులు కూడా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారతీయ తీర గస్తీదళం సంఘటన స్థలికి వెళ్ళింది. ఈ విషయమై ప్రశ్నించగా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఎలా జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడలేమని భారతీయ గస్తీదళం అధికారులు చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. పడవపై మత్స్యకారుడు ఉన్నప్పుడు పాక్ దళం చాలా రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోందని, ఈ సంఘటన గాంధీనగర్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకా ప్రాంతంలో జరిగిందని తెలిపారు. చనిపోయిన జాలరి పేరు ఇక్బాల్ (40) అని, అతనితోపాటు పడవలో మొత్తం ఆరుగురు ఉన్నారని చెబుతున్నారు.
Next Story