Telugu Global
National

ప్రధాని మోడి-ఓవైసీ రహస్య భేటీ: జేడీయు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రధాని మోడీతో ఎంఐఎం అధినేత ఒవైసీ రహస్యంగా భేటీ అయ్యారని జనతాదళ్‌ (యు) ఆరోపించింది. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఎన్డీయే కూటమికి లబ్ది చేకూర్చేందుకు, తమ కూటమిని ఓడించేందుకు ఈ రహస్య భేటీ జరిగిందని ఆరోపించింది. కొన్ని మీడియా సంస్థలు కూడా మోడీతో ఒవైసీ రహస్య భేటీపై వార్తలిచ్చాయని ఆ పార్టీ పేర్కొంది. దీనిపై బిజెపి మండిపడింది. పుకార్లు పుట్టించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు ఎంఐఎం […]

ప్రధాని మోడి-ఓవైసీ రహస్య భేటీ: జేడీయు
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రధాని మోడీతో ఎంఐఎం అధినేత ఒవైసీ రహస్యంగా భేటీ అయ్యారని జనతాదళ్‌ (యు) ఆరోపించింది. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఎన్డీయే కూటమికి లబ్ది చేకూర్చేందుకు, తమ కూటమిని ఓడించేందుకు ఈ రహస్య భేటీ జరిగిందని ఆరోపించింది. కొన్ని మీడియా సంస్థలు కూడా మోడీతో ఒవైసీ రహస్య భేటీపై వార్తలిచ్చాయని ఆ పార్టీ పేర్కొంది. దీనిపై బిజెపి మండిపడింది. పుకార్లు పుట్టించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు ఎంఐఎం పార్టీ కూడా ఈ పుకార్లను ఖండించింది. కోర్టుకు ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మోదీ ఒవైసీ రహస్య భేటీ జరిగిందనే వార్తలను ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు ఖండించడం లేదని జెడియూ వాదిస్తోంది.
First Published:  18 Sept 2015 11:53 AM IST
Next Story