పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు
వరంగల్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఏటూరు నాగారం మండలం చిట్యాల వద్ద ఈ ముగ్గురితోపాటు ఓ స్థానికుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి రెండు తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సంఘాల నేతలు దీనిపై మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో వెంటనే హాజరు పరచాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్‌కౌంటర్ కారణంగా జిల్లాలలో ఉద్రిక్తత […]
BY sarvi17 Sept 2015 6:40 PM IST
X
sarvi Updated On: 18 Sept 2015 12:11 PM IST
వరంగల్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఏటూరు నాగారం మండలం చిట్యాల వద్ద ఈ ముగ్గురితోపాటు ఓ స్థానికుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి రెండు తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సంఘాల నేతలు దీనిపై మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో వెంటనే హాజరు పరచాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్‌కౌంటర్ కారణంగా జిల్లాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పుడు మరో ముగ్గురు మావోలను అదుపులోకి తీసుకున్నారన్న వార్త మరింత కలకలం రేపుతోంది. పోలీసులు జరిపిన కూంబింగ్‌లో వీరు దొరికారని అంటున్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో వీరిని కూడా మట్టుబెడతారేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story