బంగారం అక్రమ రవాణాలోనూ ఇంటి దొంగలే!
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది కస్టమ్స్ అధికారుల విషయంలో అక్షరాల నిజమైంది. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతోంది. ఎలా పోయిందంటే.. అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల ఆర్టీ ఐ అర్జీకి ఇచ్చిన సమాధానంలో స్వయంగా కస్టమ్స్ అధికారులే వెల్లడించడం విశేషం. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు లాకర్లలో పటిష్టమైన భద్రత మధ్య ఉంచుతారు. కానీ దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న […]
BY sarvi17 Sept 2015 11:41 PM GMT
X
sarvi Updated On: 18 Sept 2015 12:31 AM GMT
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది కస్టమ్స్ అధికారుల విషయంలో అక్షరాల నిజమైంది. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతోంది. ఎలా పోయిందంటే.. అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల ఆర్టీ ఐ అర్జీకి ఇచ్చిన సమాధానంలో స్వయంగా కస్టమ్స్ అధికారులే వెల్లడించడం విశేషం. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు లాకర్లలో పటిష్టమైన భద్రత మధ్య ఉంచుతారు. కానీ దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారంలో నుంచి 26.2 కిలోలు కనిపించడం లేదని ఆర్టీ ఐ దరఖాస్తులో పేర్కొనడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. లాకర్లలో భద్రత మధ్య ఉన్న బంగారం ఎలా మాయమైంది? అంటే.. ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనేనని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఒక్క ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచే 11 కిలోలు మాయమవడం గమనార్హం. భారత్‌లో జరుగుతున్న బంగారం అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు సహకరిస్తున్నారని స్వయంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ ఐ) అంగీకరించడం విశేషం. దేశంలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ, తరువాత ముంబై, చైన్నై అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ దందాకు అడ్డాగా మారాయి. మోదీ సర్కారు వచ్చాక బంగారం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ఏడాదికాలంగా బంగారం అక్రమ రవాణా రెండింతలైంది. 2013-14 కాలంలో డీఆర్ ఐ వివిధ విమానాశ్రయాల్లో స్వాధీనం చేసుకున్న బంగారరం విలువ రూ.690 కోట్లుగా ఉంటే.. 2014-15 లోనే ఇది రూ.1,120కోట్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.
అధికారులే ఆదాయమే అధికం!
బంగారం దిగుమతి సుంకాన్ని పెంచడం దొంగరవాణా చేసే వారికంటే.. అధికారులకే ఎక్కువ లబ్ధి చేకూర్చి పెట్టింది. నిఘా తీవ్రతరం కావడంతో అవినీతి అధికారులకు ముట్టజెప్పే లంచాలు కూడా పెరిగాయి. అక్రమ బంగారాన్ని తనిఖీలను తప్పించి బయటికి తీసుకురావడంలో ఒక అధికారికి కిలోకు రూ. 50-60 వేల వరకు ముట్టజెపుతున్నారు. ఈ లెక్కన దిగుమతి సుంకం పెంపు పరోక్షం అవినీతి అధికారులకు వరంలా మారింది.
Next Story