భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటకం కలిగిస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో కూడా వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, బోధ్, చెన్నూరులో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గొర్లపల్లి వాగు ఉధృతికి 25 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.
BY admin17 Sept 2015 6:37 PM IST
admin Updated On: 18 Sept 2015 3:11 AM IST

Next Story