రేటు పెంచిన నాని
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సక్సెస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసువాలి. క్రేజ్ కొనసాగుతున్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. నాని ఇప్పుడు చేస్తోందదే. భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు తన పారితోషికం అమాంతం పెంచాడని సమాచారం. తన దగ్గరకు ఏ నిర్మాత వచ్చినా సవరించిన లెక్కలు చెబుతున్నాడట. భలే భలే మాగాడివోయ్ సినిమాకు ముందు నాని పారితోషికం కోటి పాతిక లక్షలు. భలే భలే మగాడివోయ్ సినిమాకు కూడా దాదాపు అంతే […]
BY admin17 Sept 2015 6:30 AM IST
X
admin Updated On: 16 Sept 2015 10:56 AM IST
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సక్సెస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసువాలి. క్రేజ్ కొనసాగుతున్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. నాని ఇప్పుడు చేస్తోందదే. భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు తన పారితోషికం అమాంతం పెంచాడని సమాచారం. తన దగ్గరకు ఏ నిర్మాత వచ్చినా సవరించిన లెక్కలు చెబుతున్నాడట. భలే భలే మాగాడివోయ్ సినిమాకు ముందు నాని పారితోషికం కోటి పాతిక లక్షలు. భలే భలే మగాడివోయ్ సినిమాకు కూడా దాదాపు అంతే తీసుకున్నాడు. అయితే తాజాగా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన రేటును అమాంతం పెంచేశాడు నాని. ప్రస్తుతం ఏ నిర్మాత అడిగినా రెండు కోట్ల పాతికలక్షలు చెబుతున్నాడు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా నానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిర్మాతలు ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ కుర్రహీరో పండగ చేసుకుంటున్నాడు. తన నెక్ట్స్ సినిమా సంగతుల్ని త్వరలోనే బయటపెడతానంటున్నాడు నాని.
Next Story