బస్సు కన్నం నుంచి జారిపడ్డ మహిళ!
దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఈ ఘటన అద్దంపడుతోంది. కేరళలోని పునలూరు పట్టణం సమీపంలో ఊరెళ్లేందుకు ఓ మహిళ బస్సు ఎక్కింది. ఆ మహిళ తాను కూర్చున్న సీటులో నుంచి లేచి నిలుచుంది. అంతే! ఒక్కసారిగా కదులుతున్న బస్సు అడుగు భాగంతోపాటే రోడ్డుపై పడింది. అందరూ చూస్తుండగానే.. మహిళ మీద నుంచి బస్సెళ్లిపోయింది. కానీ ఆశ్చర్యంగా ఆమెకు ఏమీ కాలేదు. అదృష్టవశాత్తూ మహిళ వెనక చక్రాల వెనకభాగంలో పడిపోయింది. దీంతో […]
BY admin17 Sept 2015 2:53 AM IST
X
admin Updated On: 17 Sept 2015 2:53 AM IST
దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఈ ఘటన అద్దంపడుతోంది. కేరళలోని పునలూరు పట్టణం సమీపంలో ఊరెళ్లేందుకు ఓ మహిళ బస్సు ఎక్కింది. ఆ మహిళ తాను కూర్చున్న సీటులో నుంచి లేచి నిలుచుంది. అంతే! ఒక్కసారిగా కదులుతున్న బస్సు అడుగు భాగంతోపాటే రోడ్డుపై పడింది. అందరూ చూస్తుండగానే.. మహిళ మీద నుంచి బస్సెళ్లిపోయింది. కానీ ఆశ్చర్యంగా ఆమెకు ఏమీ కాలేదు. అదృష్టవశాత్తూ మహిళ వెనక చక్రాల వెనకభాగంలో పడిపోయింది. దీంతో మహిళపై నుంచి బస్సు వెళ్లినా ఏమీ కాలేదు. స్వల్పగాయాలతో రోడ్డుపై పడిపోయిన ఆ మహిళకు చుట్టుపక్కల వారు వచ్చి సపర్యలు చేశారు. సర్కారు బస్సా..! మజాకా!
Next Story