Telugu Global
Others

ఈపీఎఫ్ బీమా రూ. 6 లక్షలకు పెంపు

చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఈపీఎఫ్ బీమా రూ. 6 లక్షలకు పెంచామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈపీఎఫ్ కేంద్రీయ ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీమా వర్తింపు నిబంధనలలో కొన్ని సవరణలు చేశామని తెలిపారు. ఒక్క రోజు పని చేసినా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించే ఏర్పాటు చేశామన్నారు. అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. భవిష్య నిధి ఖాతాదారులకు సమాచారం కోసం ఈపీఎఫ్ మొబైల్ […]

చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఈపీఎఫ్ బీమా రూ. 6 లక్షలకు పెంచామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈపీఎఫ్ కేంద్రీయ ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీమా వర్తింపు నిబంధనలలో కొన్ని సవరణలు చేశామని తెలిపారు. ఒక్క రోజు పని చేసినా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించే ఏర్పాటు చేశామన్నారు. అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. భవిష్య నిధి ఖాతాదారులకు సమాచారం కోసం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రవేశపెట్టామని, దీని ద్వారా ప్రతి ఉద్యోగికి ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుందని దత్తాత్రేయ తెలిపారు. ఈపీఎఫ్‌లో పని చేసే ఉద్యోగుల పదోన్నతులపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
First Published:  16 Sept 2015 6:42 PM IST
Next Story