కోల్ కతా లో నడిబొడ్డున సొరంగం!
కోల్ కతాలో నడిబొడ్డున వెలుగు చూసిన ఓ సొరంగం దేశవ్యాప్తంగా కలకలకలం రేపింది. నగరంలోని అత్యంత జనసమ్మర్ధం గలిగిన రెడ్ రోడ్ (కోల్ కతా యూనివర్సిటీ- బీఎన్ ఆర్ స్పోర్ట్స్ క్లబ్కు మధ్యలో) లో ఈ సొరంగం బయటపడింది. ఇది హై సెక్యురిటీ జోన్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సొరంగం వద్దకు చేరుకున్నారు. ఈ సొరంగం ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు ఉంది. సొరంగం విలియం కోటకు సమీపంలోనే ఉండటం విశేషం. విలియం కోట […]
BY admin17 Sept 2015 3:12 AM IST
X
admin Updated On: 17 Sept 2015 3:12 AM IST
కోల్ కతాలో నడిబొడ్డున వెలుగు చూసిన ఓ సొరంగం దేశవ్యాప్తంగా కలకలకలం రేపింది. నగరంలోని అత్యంత జనసమ్మర్ధం గలిగిన రెడ్ రోడ్ (కోల్ కతా యూనివర్సిటీ- బీఎన్ ఆర్ స్పోర్ట్స్ క్లబ్కు మధ్యలో) లో ఈ సొరంగం బయటపడింది. ఇది హై సెక్యురిటీ జోన్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సొరంగం వద్దకు చేరుకున్నారు. ఈ సొరంగం ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు ఉంది. సొరంగం విలియం కోటకు సమీపంలోనే ఉండటం విశేషం. విలియం కోట స్థానికంగా ఆర్మీకి ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోల్ కతా జాయింట్ కమిషనర్ రాజీవ్ మిశ్రా భరోసా ఇచ్చారు. ఇది కేవలం భూగర్భ విద్యుత్తు తీగలు ఎత్తుకెళ్లేందుకు మత్తు మందులకు బానిసలైన దుండగులు చేసిన చర్యగా అభివర్ణించారు. ఇందులో ఉగ్రవాద కోణమేమీ లేదని తేల్చారు. ఇలాంటి ఘటనే ఈ ప్రాంతానికి సమీపంలో 2013లో చోటు చేసుకుంది. అప్పుడు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Next Story