ధనం కన్నా విలువైంది జలం: చంద్రబాబు ఉద్బోధ
ఇబ్రహింపట్నంలో పైలాన్ ఆవిష్కరణ డబ్బు ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తామో నీరు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వినియోగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు హితవు చెప్పారు. జల వనరులను కాపాడుకోలేకపోతే మానవ మనుగడ కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు. బుధవారం కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం ఫెర్రీలో కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ తన మహా సంకల్పం పట్టిసీమను పూర్తి […]
BY sarvi16 Sept 2015 10:35 AM IST
X
sarvi Updated On: 16 Sept 2015 10:35 AM IST
ఇబ్రహింపట్నంలో పైలాన్ ఆవిష్కరణ
డబ్బు ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తామో నీరు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వినియోగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు హితవు చెప్పారు. జల వనరులను కాపాడుకోలేకపోతే మానవ మనుగడ కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు. బుధవారం కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం ఫెర్రీలో కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ తన మహా సంకల్పం పట్టిసీమను పూర్తి చేయడమని, అది దాదాపు నెరవేరిందని అన్నారు. ఈరోజు తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండి పోతుందని, తన జన్మ ధన్యమైందని చంద్రబాబు అన్నారు. ప్రతి నీటిబొట్టు కాపాడుకోవడం ద్వారా ఏపీ దేశంలోనే నెంబర్ ఒన్ కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. వర్షపు నీటిని ఒడిచి పట్టాలని తాను ప్రతిసారీ చెబుతున్నానని, నీటి ప్రాధాన్యతను గుర్తెరిగి అందరూ మసలుకోవాలని, నీటి వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని తాము భావిస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలు విజయవంతమైన నేపథ్యంలో అంతకన్నా బాగా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. గోదావరిలో పుష్కర స్నానం మిస్సయిన వారు ఇపుడు కృష్ణా పుష్కరాల్లో సందర్భంగా స్నానమాచరిస్తే అక్కడ కూడా స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని అన్నారు.
Next Story