రేవంత్ కే టీ టీడీపీ పగ్గాలు!
తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి దక్కనున్నాయా? రేవంత్ తో బాబు జరిపిన సమావేశమే ఇందుకు సంకేతమా? ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో జోరుగా నడుస్తోన్న చర్చ ఇది! ఓటుకు నోటు కేసులో అరెస్టయి షరతులతో కూడిన బెయిల్తో బయటికి వచ్చిన రేవంత్ రెడ్డి తొలిసారిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విజయవాడలో కలిశారు. వారిద్దరు చాలా సేపు పార్టీ విషయాలపై మాట్లాడారు. వారేం చర్చించారన్నది మాత్రం బయటికి రాలేదు. అయితే, తెలంగాణ తెలుగుదేశం విభాగానికి […]
తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి దక్కనున్నాయా? రేవంత్ తో బాబు జరిపిన సమావేశమే ఇందుకు సంకేతమా? ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో జోరుగా నడుస్తోన్న చర్చ ఇది! ఓటుకు నోటు కేసులో అరెస్టయి షరతులతో కూడిన బెయిల్తో బయటికి వచ్చిన రేవంత్ రెడ్డి తొలిసారిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విజయవాడలో కలిశారు. వారిద్దరు చాలా సేపు పార్టీ విషయాలపై మాట్లాడారు. వారేం చర్చించారన్నది మాత్రం బయటికి రాలేదు. అయితే, తెలంగాణ తెలుగుదేశం విభాగానికి నూతన అధ్యక్షుడి కోసం చంద్రబాబు వెతుకులాట ప్రారంభించారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆయన అన్వేషణ రేవంత్ రెడ్డి వద్ద ఆగిందని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం విభాగ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావును పెద్దగా లెక్క చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎర్రబెల్లి మార్గ మధ్యలో ఉండగానే రేవంత్ కార్యక్రమాన్ని ముగించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అవినీతి మరక పడి తెలంగాణలో పార్టీ పరువు మంటగలిపిన రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు ఎలా అప్పజెబుతారని ఎర్రబెల్లి వర్గం ప్రశ్నిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు ఇస్తే.. ఎర్రబెల్లి తప్పకుంటారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకే ఆయన హరీవ్ రావు తో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రేవంత్‌కు పగ్గాలిస్తే.. ఎర్రబెల్లి కారెక్కుతారా? పార్టీలోనే కొనసాగుతారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్!