జీవనశైలి
వస్త్రధారణ- ఆరోగ్యం మన ఆరోగ్యం మీద వస్త్రధారణ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. స్కిన్‌టైట్ మోడల్ దుస్తులతో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. చర్మానికి బిగుతుగా ఉండే దుస్తుల వలన లింఫ్‌నోడ్స్ పని తీరు మందగించడంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిర్ధారణ అయింది. మనదేహంలో అనేక చోట్ల తెల్ల రక్తకణాలు గుత్తిగా ఉంటాయి. వీటిని శోషరస కణుతులు (లింఫ్‌నోడ్స్) అంటారు. ఇవి దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించే పని కూడా చేస్తాయి. బిగుతు దుస్తుల […]
వస్త్రధారణ- ఆరోగ్యం
మన ఆరోగ్యం మీద వస్త్రధారణ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. స్కిన్‌టైట్ మోడల్ దుస్తులతో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. చర్మానికి బిగుతుగా ఉండే దుస్తుల వలన లింఫ్‌నోడ్స్ పని తీరు మందగించడంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిర్ధారణ అయింది. మనదేహంలో అనేక చోట్ల తెల్ల రక్తకణాలు గుత్తిగా ఉంటాయి. వీటిని శోషరస కణుతులు (లింఫ్‌నోడ్స్) అంటారు. ఇవి దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించే పని కూడా చేస్తాయి. బిగుతు దుస్తుల వలన ఇవి నొక్కుకు పోయి శోషరసాలను సరిగా విడుదల చేయలేకపోతాయి. దాంతో వ్యర్థాలు దేహంలో ఉండిపోతాయి. ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడేలా చేస్తుందని మారియా, బ్రియన్ క్లెమెంట్‌లు ఏడాది కిందట నిర్వహించిన ఒక పరిశోధనలో తెలియచేశారు.
దుస్తులే కాదు చెప్పులు కూడా!
బిగుతుగా ధరించే దుస్తులు మాత్రమే కాదు, పాదరక్షలు కూడా ఇలాంటి ప్రమాదాన్నే తెచ్చిపెడతాయంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. ఫ్యాషన్ కోసం పాదాలకు సౌకర్యంగా లేని పాదరక్షలు ధరించే వారిని ప్రత్యేకంగా హెచ్చరించారు.