ఏపీలో నలుగురు రైతుల ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు బలవన్మరణానికి గురయ్యారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో చింతలపూడి తులసమ్మ (36) విషం తాగి ఆత్మహత్య చేసుకోగా రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన బోయ గోవిందప్ప (60) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కాగా కడప జిల్లా కమలాపురం మండలం కోగటం గ్రామ వ్యవసాయ పొలాల్లో ఇద్దరు రైతుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిని ప్రొద్దుటూరు గోపవరానికి […]
BY sarvi16 Sept 2015 6:42 AM IST
X
sarvi Updated On: 16 Sept 2015 6:42 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు బలవన్మరణానికి గురయ్యారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో చింతలపూడి తులసమ్మ (36) విషం తాగి ఆత్మహత్య చేసుకోగా రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన బోయ గోవిందప్ప (60) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కాగా కడప జిల్లా కమలాపురం మండలం కోగటం గ్రామ వ్యవసాయ పొలాల్లో ఇద్దరు రైతుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిని ప్రొద్దుటూరు గోపవరానికి చెందిన గంజికుంట సుబ్బరాయుడు (50), మీరావలీ(25)లుగా గుర్తించారు. కోగటం-ఎర్రగుంట్ల రహదారిలో రోడ్డుకు దూరంగా ఉన్న వ్యవసాయ పొలాల్లో వేపచెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను పరిశీలించగా.. సూసైడ్‌నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. కరవు విలయతాండవం చేయడం, అప్పుల బాధ వెన్నాడుతుండడంతోనే రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
Next Story