Telugu Global
Others

గొంతులో ఇడ్లీ ఇరుక్కుని చిన్నారి మృతి

ముద్దులొలికే చిన్నారికి ఇడ్లీ తినిపిద్దామని తల్లి చేసిన ప్రయత్నం… ఆ చిన్నారి ప్రాణం తీసేసింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతలో జరిగింది. పద్మ, వెంకటయ్యలకు పృథ్వీరాజ్ అనే ఐదు నెలల చిన్నారి ఉన్నాడు. పిల్లాడికి ఇడ్లీ తినిపిద్దామని పద్మ ప్రయత్నించింది. ఓ ఇడ్లీ ముక్క చిన్నారి నోట్లో పెట్టగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి విలవిల్లాడి పోయాడు. ఏం చేయాలో అర్థంకాని ఆ తల్లిదండ్రులు […]

ముద్దులొలికే చిన్నారికి ఇడ్లీ తినిపిద్దామని తల్లి చేసిన ప్రయత్నం… ఆ చిన్నారి ప్రాణం తీసేసింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతలో జరిగింది. పద్మ, వెంకటయ్యలకు పృథ్వీరాజ్ అనే ఐదు నెలల చిన్నారి ఉన్నాడు. పిల్లాడికి ఇడ్లీ తినిపిద్దామని పద్మ ప్రయత్నించింది. ఓ ఇడ్లీ ముక్క చిన్నారి నోట్లో పెట్టగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి విలవిల్లాడి పోయాడు. ఏం చేయాలో అర్థంకాని ఆ తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే చిన్నారి ప్రాణాలు వదిలాడు.
First Published:  15 Sept 2015 6:48 PM IST
Next Story