Telugu Global
Others

దేశంలో సమతుల్యాభివృద్ధికి బాటలేద్దాం

కేంద్ర మంత్రివర్గం నిర్ణయం దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి వ్యవసాయపరంగాను, పారిశ్రామికంగాను, సాంకేతికపరంగాను తీర్చిదిద్దాలని, గ్రామాలను కూడా పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. రానున్న మూడేళ్ళ కాలంలో మూడు వందల పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలని తీర్మానించింది. బుధవారం సమావేశమైన కేబినెట్‌ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని పిలుపు ఇచ్చింది. శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ రూరల్‌ మిషన్ పథకానికి (ఎస్‌పీఎంఆర్‌ఎం) మంత్రివర్గం […]

దేశంలో సమతుల్యాభివృద్ధికి బాటలేద్దాం
X
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి వ్యవసాయపరంగాను, పారిశ్రామికంగాను, సాంకేతికపరంగాను తీర్చిదిద్దాలని, గ్రామాలను కూడా పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. రానున్న మూడేళ్ళ కాలంలో మూడు వందల పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలని తీర్మానించింది. బుధవారం సమావేశమైన కేబినెట్‌ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని పిలుపు ఇచ్చింది. శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ రూరల్‌ మిషన్ పథకానికి (ఎస్‌పీఎంఆర్‌ఎం) మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్‌పీఎంఆర్‌ఎం కింద గ్రామాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. ఆకర్షణీయ గ్రామాల అభివృద్ధికి రూ. 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారు. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక ఉగ్రవాద సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్‌ను ఐదేళ్ల పాటు నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ర్టాలు సమీకృత పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. పట్టణాలే కాదు.. గ్రామాలను ఆకర్షణీయంగా మార్చాలనేదే ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా పారిశ్రామికవేత్తలకు రాయితీ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక – ముంబయి మధ్య రైలు మార్గానికి రూ. 11,007 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
First Published:  16 Sept 2015 11:33 AM IST
Next Story