రజనీకాంత్‌కు బీజేపీ వార్నింగ్
టిప్పుసుల్తాన్ పాత్ర సూపర్ స్టార్‌కు ముప్పు తెచ్చేలా ఉంది. టిప్పు పాత్ర వేసేందుకు ఒప్పుకోవడం తప్పు..ఆ సినిమా నుంచి తప్పుకో అంటూ తమిళనాడులో హిందూ సంస్థలు, బీజేపీ రజనీకాంత్‌కు వార్నింగ్ ఇస్తున్నాయి. తలైవర్ ఒక్క డైలాగ్ ఒక్కసారి చెబితే కొన్ని వందలసార్లు థియేటర్లలో చప్పట్లు మారుమోగుతాయి. ఆయన భాష,యాస, స్టైల్ తమిళ్ సూపర్‌స్టార్‌ను చేశాయి. మంచితనానికి కేరాఫ్ అడ్రస్‌గా, ఆధ్యాత్మిక చింతనకు చిరునామాగా మారిన రజనీ గత కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా […]
BY sarvi16 Sept 2015 8:08 AM IST
X
sarvi Updated On: 16 Sept 2015 8:13 AM IST
టిప్పుసుల్తాన్ పాత్ర సూపర్ స్టార్‌కు ముప్పు తెచ్చేలా ఉంది. టిప్పు పాత్ర వేసేందుకు ఒప్పుకోవడం తప్పు..ఆ సినిమా నుంచి తప్పుకో అంటూ తమిళనాడులో హిందూ సంస్థలు, బీజేపీ రజనీకాంత్‌కు వార్నింగ్ ఇస్తున్నాయి. తలైవర్ ఒక్క డైలాగ్ ఒక్కసారి చెబితే కొన్ని వందలసార్లు థియేటర్లలో చప్పట్లు మారుమోగుతాయి. ఆయన భాష,యాస, స్టైల్ తమిళ్ సూపర్‌స్టార్‌ను చేశాయి. మంచితనానికి కేరాఫ్ అడ్రస్‌గా, ఆధ్యాత్మిక చింతనకు చిరునామాగా మారిన రజనీ గత కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ‘టిప్పు సుల్తాన్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో టిప్పుసుల్తాన్ పాత్ర రజనీ పోషిస్తారనే సమాచారంతో తమిళనాట ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా రజనీపై హిందూ సంస్థలు, బీజేపీ మండిపడుతున్నాయి. టిప్పు సుల్తాన్ క్రూరుడైన ఓ పాలకుడని వారు ఆరోపిస్తున్నారు. హిందూ వ్యతిరేకి, తమిళులను అణిచివేశాడని అటువంటి టిప్పు సుల్తాన్ పాత్రను వేసేందుకు రజనీ ఒప్పుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త అశోక్ ఖేనీ టిప్పుసుల్తాన్ సినిమాకు నిర్మాతగా వ్యహరిస్తున్నాడు. అయితే టిప్పుసుల్తాన్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా చిత్రించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది చరిత్రను వక్రీకరించడమేనని ఆరోపిస్తున్నారు. తమిళ సంఘాలు, భారతీయ జనతాపార్టీకి చెందిన కొందరు నాయకులు రజినీకాంత్ ను ఈ సినిమాలో నటించ వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ గణేశన్, హిందు మునాని సంస్థ నేత రామ గోపాలన్ రజనీని హెచ్చరిస్తూ ప్రకటనలిచ్చారు.
Next Story