Telugu Global
Others

Wonder World 27

అతిపెద్ద మ్యూజియం! స్మిత్‌సోనియన్‌ అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మ్యూజియం. నిజానికి ఇది మొత్తం 19 మ్యూజియంలు, 9 రీసెర్చ్‌ సెంటర్లతో కూడిన ఓ భవన సముదాయం. అయితే ఇంత పెద్ద మ్యూజియంను ఎలాంటి శ్రమలేకుండా మనం ఇంట్లో కూర్చుని వీక్షించేయవచ్చట. అదెలాగంటే వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ వారు విర్చువల్‌ టూర్‌తో ఈ అవకాశం కల్పిస్తున్నారు. మన మొబైల్‌ ఫోన్‌ ద్వారా గానీ, లేదంటే కంప్యూటర్‌ ద్వారా గానీ ఈ మ్యూజియంను వీక్షించవచ్చు. […]

Wonder World 27
X

అతిపెద్ద మ్యూజియం!

musiam
స్మిత్‌సోనియన్‌ అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మ్యూజియం. నిజానికి ఇది మొత్తం 19 మ్యూజియంలు, 9 రీసెర్చ్‌ సెంటర్లతో కూడిన ఓ భవన సముదాయం. అయితే ఇంత పెద్ద మ్యూజియంను ఎలాంటి శ్రమలేకుండా మనం ఇంట్లో కూర్చుని వీక్షించేయవచ్చట. అదెలాగంటే వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ వారు విర్చువల్‌ టూర్‌తో ఈ అవకాశం కల్పిస్తున్నారు. మన మొబైల్‌ ఫోన్‌ ద్వారా గానీ, లేదంటే కంప్యూటర్‌ ద్వారా గానీ ఈ మ్యూజియంను వీక్షించవచ్చు.
————————————————————————————–
టెలిగ్రాఫ్‌ను ఎలా కనుగొన్నారంటే..!

telescope
టెలిగ్రాఫ్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా? శామ్యూల్‌ మార్స్‌. వాస్తవానికి శామ్యూల్‌ ఓ ఆర్టిస్టు. అద్భుతమైన చిత్రాలను రూపొందించేవాడు. ఒకసారి ఓ చిత్రం వేయడానికి ఆయన పొరుగూరు వెళ్లాడు. ఆయన భార్య అనారోగ్యం పాలై చివరకు మరణించింది. శామ్యూల్‌కు ఆమె అనారోగ్యం వార్త చేరడానికే చాలా రోజులు పట్టింది. శామ్యూల్‌ తిరిగి వచ్చేసరికి భార్య మరణించింది. దాంతో శామ్యూల్‌ గుండె బద్దలయ్యింది. ఆ తర్వాత తన ఆర్టిస్టు కెరీర్‌ను వదిలేసిన శామ్యూల్‌ దూరప్రాంతాలకు వేగంగా సమాచారం చేరవేసే పద్ధతిని కనిపెట్టడంపై దృష్టి నిలిపాడు. అలా టెలిగ్రాఫ్‌ను కనుగొన్నాడు.

First Published:  14 Sept 2015 6:34 PM IST
Next Story