ఎర్రబెల్లి కారెక్కుతారా?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయారకర్‌రావు సొంత పార్టీ అధినేత చంద్రబాబుపై అలిగాడా? పార్టీలో రేవంత్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదా? మరోసారి టీఆర్ ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారా? అందుకే ఆయన హరీశ్ రావును కలిశారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణ టీడీపీ నాయకులను వేధిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్లో షరతులు సడలించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో టీడీపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలోరేవంత్ రెడ్డి కేసీఆర్ […]
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయారకర్‌రావు సొంత పార్టీ అధినేత చంద్రబాబుపై అలిగాడా? పార్టీలో రేవంత్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదా? మరోసారి టీఆర్ ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారా? అందుకే ఆయన హరీశ్ రావును కలిశారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణ టీడీపీ నాయకులను వేధిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్లో షరతులు సడలించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో టీడీపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలోరేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సభ ప్రారంభమయ్యేనాటికి ఎర్రబెల్లి కూకట్ పల్లిలో మరోపనిలో ఉన్నారు. అయితే ముగింపు ఉపన్యాసం ఎర్రబెల్లి ఇవ్వాల్సి ఉంది. ఎర్రబెల్లి మార్గమధ్యలో ఉండగానే రేవంత్ రెడ్డి సభను ముగించాడు. దీన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. అవినీతి మరకపడ్డ రేవంత్ రెడ్డీకి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఎర్రబెల్లికి మింగుడుపడటం లేదు. దీంతో తనకు ఎప్పటికైనా టీఆర్ ఎస్ ద్వారాలు తెరిచే ఉన్నాయని పార్టీ అధినేతకు సంకేతాలు ఇచ్చేందుకు హరీష్ రావు తో భేటీ అయ్యాడని టీ టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఎర్రబెల్లి మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చేశారు. కేవలం పాలకుర్తి చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరేందుకు మాత్రమే కలిశానని చెప్పుకొచ్చారు. నా వెంట రైతులు కూడా ఉన్నారని, ఇది రాజకీయ భేటీ కాదని వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇది కచ్చితంగా చంద్రబాబుకు హెచ్చరిక అని, రేవంత్ దూకుడు కళ్లెం వేయకపోతే తాను పార్టీ వదిలిపోతానని చెప్పేందుకే ఎర్రబెల్లి ఇలా పరోక్ష సంకేతాలు ఇచ్చారని సొంతపార్టీ నేతలే విశ్లేషించుకుటున్నారు.