Telugu Global
NEWS

'స్థానికత'పై తెలుగు రాష్ట్రాల ఒప్పందం!

నాలుగు సంవత్సరాలపాటు ఎక్కడ వరుసగా చదువుకుంటే అక్కడే స్థానికులుగా చెలామణి అవుతారని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్సులో చేరే సమయానికి నాలుగేళ్లు (ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుకు 7, 8, 9, 10 తరగతులను ప్రామాణికంగాను,  బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు 9, 10 తరగతులు, ఇంటర్‌ రెండేళ్లు ప్రాతిపదికగాను నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఎక్కడ చదువుకుంటే అక్కడే (ఆ రాష్ట్రంలోనే) స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఎస్సీ సంక్షేమ శాఖ తెలిపింది.  వాస్తవానికి, ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల […]

నాలుగు సంవత్సరాలపాటు ఎక్కడ వరుసగా చదువుకుంటే అక్కడే స్థానికులుగా చెలామణి అవుతారని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్సులో చేరే సమయానికి నాలుగేళ్లు (ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుకు 7, 8, 9, 10 తరగతులను ప్రామాణికంగాను, బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు 9, 10 తరగతులు, ఇంటర్‌ రెండేళ్లు ప్రాతిపదికగాను నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఎక్కడ చదువుకుంటే అక్కడే (ఆ రాష్ట్రంలోనే) స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఎస్సీ సంక్షేమ శాఖ తెలిపింది.
వాస్తవానికి, ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల విద్యార్థులూ విజయనగరంలో కోరుకొండ సైనిక్‌ స్కూలు, కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదువుకున్నారు. రాష్ట్ర విభజనతో ఈ రెండూ ఏపీకే వెళ్లాయి. అలాగే, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన విద్యార్థులు కొంతమంది పదో తరగతి దాకా తెలంగాణలోనే చదువుకొని, ఇంటర్‌, ఆపై చదువులకు ఏపీలోని కర్నూలు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్ళి అక్కడ పూర్తి చేశారు. వీరందరి స్థానికతను ఎలా నిర్ణయించాలన్న అనుమానాలకు తెర దించుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాంఘిక సంక్షేమ శాఖల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన ఫీజుల భారాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్ఫత్తిలో పంచుకోనున్నాయి. కాగా, 2014-15 విద్యా సంవత్సరంలో బీసీ జాబితాలో ఫీజుల లబ్ధి పొందినా.. విభజనతో ఉనికిలో లేని కులాల విద్యార్థులను ‘స్థానికత’ కింద 2015-16లో ఈబీసీగా తెలంగాణ ప్రభుత్వం పరిగణించనుంది.
First Published:  15 Sept 2015 4:44 AM GMT
Next Story