మరో వివాదంలో పూజా మిశ్రా!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ మోడల్, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ పూజా మిశ్రా మరో వివాదంతో తెరమీదకొచ్చింది. హోటల్ సిబ్బందిపై పూజా మిశ్రా దాడి చేసిన వీడియో ఒకటి ఇంటర్ నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది. విషయమేంటంటే.. ఇటీవల పూజా మిశ్రా న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ద్వారకాలో బస చేసింది. ఆమె ఉన్న రూములో కొన్ని సామన్లు పగిలాయి. వాటికి బిల్లు కట్టకుండా పూజా మిశ్రా వెళ్లేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న సిబ్బందిని కొట్టింది. […]
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ మోడల్, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ పూజా మిశ్రా మరో వివాదంతో తెరమీదకొచ్చింది. హోటల్ సిబ్బందిపై పూజా మిశ్రా దాడి చేసిన వీడియో ఒకటి ఇంటర్ నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది. విషయమేంటంటే.. ఇటీవల పూజా మిశ్రా న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ద్వారకాలో బస చేసింది. ఆమె ఉన్న రూములో కొన్ని సామన్లు పగిలాయి. వాటికి బిల్లు కట్టకుండా పూజా మిశ్రా వెళ్లేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న సిబ్బందిని కొట్టింది. సామాను తీసుకెళ్లకుండా ఆపిన వారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వెంటపడి తన్నింది. ఈ దృశ్యాన్ని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన హోటల్ సిబ్బందిపైనా దాడి చేసింది. వివాదాలు పూజా మిశ్రా కొత్తకానే కాదు. గతంలో ఓ సారి నోయిడా అతిథి గృహంలో మూడు రోజుల పాటు తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. అంతకుముందేమో.. సోనాక్షి సిన్హా, ఇషా కొప్పికర్లపై కేసులు పెట్టిన ఘనత కూడా అమ్మడిదే!
https://www.youtube.com/watch?v=CXDwQ0eWrw8