Telugu Global
Others

తమిళనాడుకు కావేరీ జ‌లాల‌ను ఇవ్వ‌లేం: కర్ణాటక

ప్రస్తుత పరిస్థితుల్లో కావేరీ నదీ జలాలను తమిళనాడుకు వదిలే అవకాశం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఎంబీ పాటిల్‌ ప్రభుత్వం తరపున జయలలితకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత కరువు పరిస్థితులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆ లేఖలో ఆయన జయలలితకు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రయోజనాలను పణంగా పెట్టి తమిళనాడు వ్యవసాయ పనులకు నీళ్లు అందించడం వీలుకాదని వివరణ ఇచ్చారు. […]

ప్రస్తుత పరిస్థితుల్లో కావేరీ నదీ జలాలను తమిళనాడుకు వదిలే అవకాశం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఎంబీ పాటిల్‌ ప్రభుత్వం తరపున జయలలితకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత కరువు పరిస్థితులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆ లేఖలో ఆయన జయలలితకు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రయోజనాలను పణంగా పెట్టి తమిళనాడు వ్యవసాయ పనులకు నీళ్లు అందించడం వీలుకాదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాదిలో 192 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 64 టీఎంసీలను మాత్రమే కర్ణాటక విడుదల చేసింది. ప్రస్తుత కరువు పరిస్థితుల నడుమ తమిళనాడుతో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై తమిళనాడుకు లేఖ రాయడానికి ముందు… అంతరాష్ట్ర నదీజలాల వివాదంలో కర్ణాటక తరపున లాయర్‌గా వ్యవహరిస్తున్న ఫాలీ నారిమన్‌ సలహాను మంత్రి ఎంబీ పాటిల్‌ తీసుకున్నారు.
First Published:  14 Sept 2015 6:40 PM IST
Next Story