Telugu Global
Others

కృష్ణా ట్రిబ్యునల్ కేసు విచారణ 30కి వాయిదా

గతంలో కృష్ణా ట్రిబ్యునల్‌లో జరిగిన వాదనల్లో తెలంగాణకు నష్టం జరిగిందని, కృష్ణా జలాల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని, కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి దీన్ని సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినందున కృష్ణా ట్రిబ్యునల్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని… తమ వాదనలు విన్న తర్వాతే నీటి కేటాయింపులు జరపాలంటూ టి.సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో […]

గతంలో కృష్ణా ట్రిబ్యునల్‌లో జరిగిన వాదనల్లో తెలంగాణకు నష్టం జరిగిందని, కృష్ణా జలాల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని, కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి దీన్ని సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినందున కృష్ణా ట్రిబ్యునల్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని… తమ వాదనలు విన్న తర్వాతే నీటి కేటాయింపులు జరపాలంటూ టి.సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో ట్రిబ్యునల్‌లోని ముగ్గురు జడ్జిల్లో ఒకరు రాజీనామా చేశారు. దీంతో ఆ ఖాళీని భర్తీ చేయాలంటూ కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయగా ఆ స్థానంలో హైకోర్టు జడ్జి రామ్మోహన్‌ను కొత్తగా నియమిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకు తెలియజేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఉన్నతన్యాయస్థానం ఈనెల 30కి వాయిదా వేసింది.
First Published:  14 Sept 2015 6:38 PM IST
Next Story