జూనియర్‌కు కిక్-2 దెబ్బ !
ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన కిక్-2 చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఏకంగా రూ.12 కోట్లు కోల్పోయాడు జూనియర్. ఆర్థిక సమస్యల కారణంగా కిక్-2 విడుదలలో తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే! ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించాడు. సినిమా విడుదల కావాలంటే.. రూ.12 కోట్లు అవసరమయ్యాయి. ఈ ఫైనాన్స్ డీల్ క్లియర్ చేయడానికి జూనియర్ రంగంలోకి దిగాడు. తను నేరుగా రూ.6 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. జూనియర్‌తో ఉన్న స్నేహం […]
BY admin15 Sept 2015 1:30 AM IST
X
admin Updated On: 15 Sept 2015 6:34 AM IST
ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన కిక్-2 చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఏకంగా రూ.12 కోట్లు కోల్పోయాడు జూనియర్. ఆర్థిక సమస్యల కారణంగా కిక్-2 విడుదలలో తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే! ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించాడు. సినిమా విడుదల కావాలంటే.. రూ.12 కోట్లు అవసరమయ్యాయి. ఈ ఫైనాన్స్ డీల్ క్లియర్ చేయడానికి జూనియర్ రంగంలోకి దిగాడు. తను నేరుగా రూ.6 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. జూనియర్‌తో ఉన్న స్నేహం కారణంగా నిర్మాత దిల్‌రాజు మరో రూ.6 కోట్లు సర్దాడు. దీంతో ఎట్టకేలకు సినిమా విడుదలైంది. ఆ తరువాత ఫలితం మనందరికీ తెలిసిందే. మొత్తం సినిమా బడ్జెట్‌లో సగం కూడా వసూలు కాలేదు. దీంతో జూనియర్ తాను పెట్టుబడి పెట్టిన రూ.6 కోట్లు కోల్పోగా, మరో రూ.6 కోట్లు దిల్‌రాజుకు బాకీ పడ్డాడు. దిల్‌రాజు ఊరుకుంటాడా..? తమ్ముడు తమ్మడే.. పేకాట.. పేకాటే..! అన్న చందంగా.. జూనియర్‌తో చేసే నెక్స్ట్ సినిమాకు ఇవ్వాల్సిన అడ్వాన్స్‌లో రూ.6 కోట్లు కట్ చేసుకున్నాడు. దీంతో చేసేది లేక దిల్‌రాజు ప్రతిపాదనకు జూనియర్ ఒకే చెప్పాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న జూనియర్.. బ్రిటన్‌లో షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చి మరీ ఈ డీల్ క్లియర్ చేసుకున్నాడట. పాపం! జూనియర్ కిక్-2 దెబ్బకు రూ.12 కోట్లు వదులుకోవాల్సి వచ్చింది.
Click For Rakul Preet Singh Exclusive Photos
Next Story