ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమం
తిరుపతిలో వై.ఎస్. జగన్ హోదా భేరీ… ప్రత్యేక హోదాపై సాధించిన హామీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, లభించిన హామీని అమలు చేయించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థుల యువ భేరీలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఈ హోదా సాధించే వరకు విశ్రమించవద్దని పిలుపు ఇచ్చారు. విద్యార్థులు… ముఖ్యంగా మన తరం తలచుకుంటే సాధించలేనిది ఉండదని, ప్రత్యేక హోదా సాధన […]
BY sarvi15 Sept 2015 7:51 AM IST
X
sarvi Updated On: 15 Sept 2015 7:51 AM IST
తిరుపతిలో వై.ఎస్. జగన్ హోదా భేరీ…
ప్రత్యేక హోదాపై సాధించిన హామీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, లభించిన హామీని అమలు చేయించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థుల యువ భేరీలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఈ హోదా సాధించే వరకు విశ్రమించవద్దని పిలుపు ఇచ్చారు. విద్యార్థులు… ముఖ్యంగా మన తరం తలచుకుంటే సాధించలేనిది ఉండదని, ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి ఉద్యమిద్దామని ఆయన అన్నారు. యూనివర్శిటీ క్యాంపన్‌లో విద్యార్థులతో సమావేశమవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, రాజకీయ సమావేశాలకు వర్శిటీ వేదికగా ఉండకూడదని నీతులు చెబుతుందని అన్నారు. చంద్రబాబునాయుడు టీడీఎల్‌పీ సమావేశం ఇక్కడ యూనివర్శిటీలో పెట్టలేదా? ప్రధాని మోడి రాష్ట్రానికి వచ్చినపుడు ఇక్కడ మీటింగ్ పెట్టలేదా అని ప్రశ్నించారు. అన్నిపార్టీలు కలిపి రాష్ట్రాన్ని విడగొట్టాయని, ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది… బీజేపీ డిమాండు చేసి సాధించింది. కాని పార్లమెంట్ ఇచ్చిన హామీని అమలు చేయించుకునే దిక్కూదివాణం లేని పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయి దుస్థితిలో ఉందో ఊహించవచ్చని జగన్ విమర్శించారు. ప్రస్తుత పార్లమెంటును చూస్తే ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో పోరాడామని, కాని అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలెవరూ ఈ అంశంపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హోదా ఇవ్వకుంటే కేంద్రంలో ఉన్న మంత్రులు రాజీనామా చేస్తారని చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని హెచ్చరించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసు నుంచి బయట పడడానికి కేంద్రం వద్ద సాగిలపడ్డారని, ఈ నేపథ్యంలోనే ఆయన నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కొంతమంది నేతలకు ప్రత్యేక హోదా ప్రయోజనాలేమిటో తెలియదని, ఇలాంటి వారికి చెప్పినా అర్ధం కావని కొంతమంది మంత్రులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
Next Story