జార్ఖండ్‌లో ఐదుగురు మావోల అరెస్ట్
జార్ఖండ్‌లోని పలాము జిల్లా ఛతర్‌పూర్ అడవుల్లో ఐదుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాష్ట్రంలో నిషేధిత జార్ఖండ్ జనముక్తి మోర్చాకి చెందినవారుగా తెలిపారు. సీఆర్‌పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్స్‌లో వీరు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు జార్ఖండ్‌లోని పలాము ప్రాంతవాసులు కాగా ఒకరు బీహార్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిపై చాలా కేసులున్నట్టు ఐజీ సాకేత్‌సింగ్ చెప్పారు. తీవ్రవాదుల నుంచి ఆయుధాలు, సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
BY sarvi14 Sept 2015 6:43 PM IST
sarvi Updated On: 15 Sept 2015 12:03 PM IST

Next Story