అమరావతి మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా ఎన్.పి. రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ రవాణా, రోడ్లు భవనాలశాఖ, పెట్టుబడులు, మౌలికవసతుల కల్పన శాఖలకు సంబంధించి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. మూడేళ్ళపాటు బాధ్యతలు నిర్వహించే రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అనేక ప్రభుత్వ శాఖల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న ఆయనను మెట్రో ప్రాజెక్టులో భాగస్వామిని చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ […]
BY sarvi15 Sept 2015 6:12 AM IST

X
sarvi Updated On: 15 Sept 2015 6:12 AM IST
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా ఎన్.పి. రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ రవాణా, రోడ్లు భవనాలశాఖ, పెట్టుబడులు, మౌలికవసతుల కల్పన శాఖలకు సంబంధించి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. మూడేళ్ళపాటు బాధ్యతలు నిర్వహించే రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అనేక ప్రభుత్వ శాఖల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న ఆయనను మెట్రో ప్రాజెక్టులో భాగస్వామిని చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, విజయవాడ మెట్రోరైలును అమరావతి మెట్రోరైలుగా నామకరణం చేశారు.
Next Story