Telugu Global
Others

డ‌యాల‌సిస్ లో ఎస్పీవై రెడ్డి..

నంద్యాల ఎంపీ, ప్రముఖ దాత, ప్రఖ్యాత‌ పారిశ్రామిక‌వేత్త ఎస్పీవై రెడ్డి హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌త కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఎంపీని చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ఎస్పీవైకి ప్ర‌స్తుతం డ‌యాల‌సిస్ చేస్తున్నార‌ని, గ‌తం కంటే ఆరోగ్య ప‌రిస్థితి కొంత మెరుగైంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. పైపుల రెడ్డిగా తెలుగు రాష్ర్టాల‌కు సుప‌రిచితుడైన ఎస్పీవైరెడ్డి..నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ గా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు […]

డ‌యాల‌సిస్ లో ఎస్పీవై రెడ్డి..
X

నంద్యాల ఎంపీ, ప్రముఖ దాత, ప్రఖ్యాత‌ పారిశ్రామిక‌వేత్త ఎస్పీవై రెడ్డి హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌త కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఎంపీని చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ఎస్పీవైకి ప్ర‌స్తుతం డ‌యాల‌సిస్ చేస్తున్నార‌ని, గ‌తం కంటే ఆరోగ్య ప‌రిస్థితి కొంత మెరుగైంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. పైపుల రెడ్డిగా తెలుగు రాష్ర్టాల‌కు సుప‌రిచితుడైన ఎస్పీవైరెడ్డి..నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ గా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన ఎస్పీవై రెడ్డి..నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. హాట్ హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే వ్య‌క్తిగా పేరొందిన ఎస్పీవై రెడ్డి గ‌త‌కొంత‌కాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. కిడ్నీ స‌మ‌స్య‌ల వైద్యం కోసం రెండు వారాల క్రిత‌మే ఆయ‌న ప్ర‌ముఖ కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతార‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు.

First Published:  14 Sept 2015 1:52 AM
Next Story