అక్షర శిక్షలు!
ఇరాన్‌లో ఒక న్యాయమూర్తి నేరస్తులకు ఒక విచిత్రమైన శిక్షని విధించారు. ఇరాన్‌లోని గాన్‌బాద్ ఆ కేవస్ నగర కోర్టు జడ్జి ఖాసిం నఖీజదే, నేరస్తులు ఒక్కొక్కరు ఐదు పుస్తకాలను కొని చదివి, వాటిపై సమీక్షలు రాయాలని తీర్పు ఇచ్చారు. ఆ దేశపు న్యూస్ ఏజన్సీ అందిస్తున్న సమాచారం ప్రకారం, ఖైదీలు పుస్తకాలపై సమీక్షలు రాసిన తరువాత వాటిని తిరిగి న్యాయమూర్తికి అందజేయాల్సి ఉంటుంది. ఆ పుస్తకాలను ఆయన స్థానిక జైలుకి పంపుతారు. నేరస్తులు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన […]
ఇరాన్‌లో ఒక న్యాయమూర్తి నేరస్తులకు ఒక విచిత్రమైన శిక్షని విధించారు. ఇరాన్‌లోని గాన్‌బాద్ ఆ కేవస్ నగర కోర్టు జడ్జి ఖాసిం నఖీజదే, నేరస్తులు ఒక్కొక్కరు ఐదు పుస్తకాలను కొని చదివి, వాటిపై సమీక్షలు రాయాలని తీర్పు ఇచ్చారు. ఆ దేశపు న్యూస్ ఏజన్సీ అందిస్తున్న సమాచారం ప్రకారం, ఖైదీలు పుస్తకాలపై సమీక్షలు రాసిన తరువాత వాటిని తిరిగి న్యాయమూర్తికి అందజేయాల్సి ఉంటుంది. ఆ పుస్తకాలను ఆయన స్థానిక జైలుకి పంపుతారు. నేరస్తులు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన సూక్తులను సైతం సేకరించాల్సి ఉంటుంది. ఇటీవల అక్కడ సవరించిన ఒక చట్టం ప్రకారం న్యాయమూర్తులు కొన్ని కేసుల విషయంలో ఇలా ప్రత్యామ్నాయ శిక్షలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
టీనేజర్లకు, చిన్నపాటి నేరాలను చేసినవారికి, అంతకుముందు నేరచరిత్ర లేనివారికి ఆయన ఈ శిక్షలను విధిస్తున్నారు. కోర్టు ఆమోదించిన పుస్తకాల్లోంచి నేరస్తులు తమకు నచ్చినవాటిని ఎంపిక చేసుకోవచ్చు. చదువు, తెలివితేటలు, వయసుతో సంబంధం లేకుండా అందరికీ అర్థమయ్యేలా రచించిన పుస్తకాలను ఇందుకు ఎంపిక చేశామని ఆ న్యాయమూర్తి న్యూస్ ఏజన్సీకి తెలిపారు. తరువాత పుస్తకాలను జైళ్లకు పంపడం వలన వాటిని అందుకున్న వారికి సైతం మేలు జరుగుతుందని, పుస్తకాల వలన లోపల ఖైదీల్లో తరచుగా జరిగే గొడవలు తగ్గుతాయని ఆయన చెబుతున్నారు.