మహేష్ బాబు అమ్మమ్మ గారి ఊరెళ్లిన కొరటాల శివ...
సొంతూరు కన్నతల్లి లాంటింది. మనిషి ఎంత ఎదిగిన మూలాల్ని మరచి పోకూడదు అనే పాయింట్ తో కొరటాల శివ చేసిన శ్రీమంతుడు చిత్రం చేసి అందర్నీ మెప్పించారు. ఒక బిలియనీర్ సొంత గ్రామం కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడు అనే కథాంశాన్ని కొరటాల శివ ఎమోషనల్ గా తెరకెక్కించి… కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాడు. కట్ చేస్తే.. కొరటాల శివ ఆదివారం తన కుటుంబం తో కలసి […]
BY admin14 Sept 2015 6:49 AM IST
X
admin Updated On: 14 Sept 2015 6:49 AM IST
సొంతూరు కన్నతల్లి లాంటింది. మనిషి ఎంత ఎదిగిన మూలాల్ని మరచి పోకూడదు అనే పాయింట్ తో కొరటాల శివ చేసిన శ్రీమంతుడు చిత్రం చేసి అందర్నీ మెప్పించారు. ఒక బిలియనీర్ సొంత గ్రామం కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడు అనే కథాంశాన్ని కొరటాల శివ ఎమోషనల్ గా తెరకెక్కించి… కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాడు. కట్ చేస్తే.. కొరటాల శివ ఆదివారం తన కుటుంబం తో కలసి భద్రాచలం సందర్శించారు.
ఈ ట్రిప్పు లో డైరెక్టర్ శివ .. మహేష్ బాబు వాళ్ల అమ్మమ్మ గారి వూరు ను సందర్శించి అక్కడ మహేష్ అభిమానుల్ని కలిశారు. అంతే కాదు..ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు అనే గ్రామం హీరో మహేష్ వాళ్ల అమ్మమ్మ గారిది.శ్రీమంతుడు ఇచ్చిన సక్సెస్ ను ఇచ్చిన కొరటాల శివ బూర్గం పాడు దగ్గరలో మోతిగడ్డ దీవిలోని వీరభద్ర స్వామి దేవాలయం సందర్శించారు. కొరటాల రాకతో చుట్టు పక్కల సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా మంచి చిత్రాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. తన నుంచి మరికొన్ని సందేశాత్మక చిత్రాలొస్తాయని చెప్పారు. ఇక శ్రీమంతుడు చిత్రం తరువాత స్టార్ హీరోలందరు కొరటాల శివను ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story