Telugu Global
Cinema & Entertainment

కాజ‌ల్ స‌హ‌జీవ‌నం పై క్లారిటీ..!

ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోకుండానే పరస్పర అంగీకరాంతో కలిసి జీవించడం, కాపురం చేయడం, పెళ్లికి ముందే సెక్స్, పిల్లల్ని కనడం లాంటి సంస్కృతి మన దేశంలోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లు ముందు ఉంటున్నారు. ఇలాంటి సంస్కృతి మన దేశంలో విస్తరించడంపై కొందరు సాంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నారు. అయితే హీరోయిన్ కాజల్ మాత్రం సమర్దిస్తోంది. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు అందులో తప్పేంలేదనుకుంటాను. మన సంప్రదాయానికి వ్యతిరేకం కాదనేది తన అభిప్రాయమని […]

కాజ‌ల్ స‌హ‌జీవ‌నం పై క్లారిటీ..!
X

ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోకుండానే పరస్పర అంగీకరాంతో కలిసి జీవించడం, కాపురం చేయడం, పెళ్లికి ముందే సెక్స్, పిల్లల్ని కనడం లాంటి సంస్కృతి మన దేశంలోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లు ముందు ఉంటున్నారు. ఇలాంటి సంస్కృతి మన దేశంలో విస్తరించడంపై కొందరు సాంప్రదాయ వాదులు వ్యతిరేకిస్తున్నారు. అయితే హీరోయిన్ కాజల్ మాత్రం సమర్దిస్తోంది. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు అందులో తప్పేంలేదనుకుంటాను. మన సంప్రదాయానికి వ్యతిరేకం కాదనేది తన అభిప్రాయమని తెలిపింది. తాను ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని, కాబోయేవాడు బాగా చదువుకుని, స్వతంత్ర నిర్ణయాలతో ఆశావహ దృక్ఫథంలో ఉండే వాడు కావాలంటోంది.
ఇక కెరీర్ ప‌రంగా తెలుగులో ప్ర‌స్తుతం స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ , బ్ర‌హ్మోత్స‌వం చిత్రాలు చేస్తుండ‌గా..త‌మిళ్ లో ఒక‌టి రెండు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. కెరీర్ లో లాంగ్ టైమ్ గ్లామ‌ర్ హీరోయిన్ గా ఉండ‌టానికే త‌న ఓటు అని గ‌తంలో తేల్చిన విష‌యం తెలిసిందే.మొత్తం మీద ఈ ముద్దుగుమ్మ స‌హజీవనం విష‌యంలో మ‌రీ అంత రిజిడ్ గా లేద‌న్న‌మాట‌. లిబ‌ర‌ల్ గా ఉంది మ‌రి.!

Click For Kajal Agarwal Latest Still

First Published:  14 Sept 2015 7:30 AM IST
Next Story