జర నవ్వండి ప్లీజ్ 205
“డాక్టర్! నేను ఒక మేకనని అనుకుంటూ ఉంటాను” “ఇట్లా ఎప్పటినించి అనుకుంటున్నారు?” “నాకు ఊహ తెలిసినప్పట్నించీ అనుకుంటున్నాను” “కాంపౌండర్! ఈ మేకను తీసుకెళ్ళి పశువుల దొడ్లో కట్టెయ్!” వచ్చిన పేషెంట్ పారిపోయాడు. —————————————————————————————— తండ్రి: మూడు ద్రాక్షపళ్ళకు మరో నాలుగు ద్రాక్షపళ్ళు కలిపితే ఎన్నవుతాయి? కొడుకు: నాకు తెలీదు డాడీ! తండ్రి: నిన్ననే మూడు ఫ్లస్ నాలుగు చెప్పావు కదరా! కొడుకు: మా టీచర్ అరటిపళ్ళు అన్నదే కానీ ద్రాక్షపళ్ళు అనలేదు. —————————————————————————————— టీచర్: శేఖర్! కిలోమీటర్, […]
“డాక్టర్! నేను ఒక మేకనని అనుకుంటూ ఉంటాను”
“ఇట్లా ఎప్పటినించి అనుకుంటున్నారు?”
“నాకు ఊహ తెలిసినప్పట్నించీ అనుకుంటున్నాను”
“కాంపౌండర్! ఈ మేకను తీసుకెళ్ళి పశువుల దొడ్లో కట్టెయ్!”
వచ్చిన పేషెంట్ పారిపోయాడు.
——————————————————————————————
తండ్రి: మూడు ద్రాక్షపళ్ళకు మరో నాలుగు ద్రాక్షపళ్ళు కలిపితే ఎన్నవుతాయి?
కొడుకు: నాకు తెలీదు డాడీ!
తండ్రి: నిన్ననే మూడు ఫ్లస్ నాలుగు చెప్పావు కదరా!
కొడుకు: మా టీచర్ అరటిపళ్ళు అన్నదే కానీ ద్రాక్షపళ్ళు అనలేదు.
——————————————————————————————
టీచర్: శేఖర్! కిలోమీటర్, సెంటీమీటర్ ఈ రెండుపదాల్ని ఉపయోగించి ఒక వ్యాకం చెప్పు.
శేఖర్: మా అక్క కిలోమీటర్ పొడువు, నేను సెంటీమీటర్ పొడవు ఉన్నాం.