అమెరికా సైన్యాధికారులను చంపేస్తాం: ఐఎస్ హెచ్చరిక
వంద మంది అమెరికా సైన్యాధికారులను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. సెప్టెంబర్ 11 దాడుల శుభాకాంక్షలు చెబుతూ తాము చంపబోయే అమెరికా సైన్యాధికారుల ఫొటోలు, వివరాలు కూడా ఈ తీవ్రవాదులు విడుదల చేశారు. మారణకాండ మొదలెడతామని కూడా వారు ట్వీట్ చేశారు. దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా నోరు మెదపలేదు. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి పేరుతో విడుదలైన ఆడియో టేపుల్లో అమెరికాతోపాటు పశ్చిమ దేశాలపై దాడులు తీవ్రం చేయాలని ఉగ్రవాద సంస్థలకు పిలుపునిచ్చాడు. ఇస్లామిక్ […]
BY Pragnadhar Reddy13 Sept 2015 7:06 PM IST
Pragnadhar Reddy Updated On: 14 Sept 2015 5:09 PM IST
వంద మంది అమెరికా సైన్యాధికారులను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. సెప్టెంబర్ 11 దాడుల శుభాకాంక్షలు చెబుతూ తాము చంపబోయే అమెరికా సైన్యాధికారుల ఫొటోలు, వివరాలు కూడా ఈ తీవ్రవాదులు విడుదల చేశారు. మారణకాండ మొదలెడతామని కూడా వారు ట్వీట్ చేశారు. దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా నోరు మెదపలేదు. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరి పేరుతో విడుదలైన ఆడియో టేపుల్లో అమెరికాతోపాటు పశ్చిమ దేశాలపై దాడులు తీవ్రం చేయాలని ఉగ్రవాద సంస్థలకు పిలుపునిచ్చాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తమకు విభేధాలున్నమాట నిజమే అయినా కలిసి దాడులు చేసేందుకు అవేమీ అడ్డు రావని పేర్కొన్నాడు.
Next Story