Telugu Global
Others

కల్లులో మత్తు తగ్గి మంచానపడ్డ తాగుబోతులు!

మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో తట్టుకోలేని కల్లు సేవించే వ్యక్తులు మంచాన పడుతున్నారు. ఇది నిజామాబాద్‌ జిల్లాలోని ముఖచిత్రం. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి ఇలాంటి బాధితులతో నిండిపోయింది. మొదట 10 మంది ఆస్పత్రిలో చేరినా క్రమంగా ఈ సంఖ్య దాదాపు 70 మంది వరకు చేరింది. వింతవింతగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి వేషాలేస్తూ రోగులు డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే… వీరి ప్రవర్తనను తట్టుకోలేక డాక్టర్లే వారిని మంచాలకు కట్టివేసి చికిత్స చేస్తున్నారు. దీనికి […]

కల్లులో మత్తు తగ్గి మంచానపడ్డ తాగుబోతులు!
X
మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో తట్టుకోలేని కల్లు సేవించే వ్యక్తులు మంచాన పడుతున్నారు. ఇది నిజామాబాద్‌ జిల్లాలోని ముఖచిత్రం. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి ఇలాంటి బాధితులతో నిండిపోయింది. మొదట 10 మంది ఆస్పత్రిలో చేరినా క్రమంగా ఈ సంఖ్య దాదాపు 70 మంది వరకు చేరింది. వింతవింతగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి వేషాలేస్తూ రోగులు డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే… వీరి ప్రవర్తనను తట్టుకోలేక డాక్టర్లే వారిని మంచాలకు కట్టివేసి చికిత్స చేస్తున్నారు. దీనికి రోగుల తరఫు బంధువులు కూడా సహకరిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించిన తర్వాత కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడైనా కృత్రిమ కల్లు తయారు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దాంతో ఇప్పటివరకు ఆడింది ఆట…పాడింది పాటలా తయారైన కల్తీ కల్లు విక్రయదారులు గత్యంతరం లేని పరిస్థితిలో కల్లులో మత్తు పదార్థాలను చొప్పించే స్థాయిని తగ్గించేశారు. ప్రస్తుతం కల్లు మార్కెట్లోకి యధావిధిగా వస్తోంది. కొన్ని దశాబ్దాలుగా మత్తు పదార్థాలు ఎక్కువ కలిపిన కల్లుకు తాగడానికి అలవాటుపడిన కల్లుబాబులకు ఇది ఎంత తాగినా కిక్కు ఇవ్వడం లేదు. పైగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా వీరంతా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ వింత చేష్టలకు పాల్పడుతున్నారు.
కల్లు బాధితులు డాక్టర్లనే కాదు… తమ కుటుంబీకులను సైతం గుర్తించలేని దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నరాల బలహీనతతోపాటు తామేం చేస్తున్నామో తెలియనంత ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. విషతుల్యమయ్యే కల్లు కాకుండా కిక్కు ఎక్కని కల్లు తాగి మంచాన పడిన రోగుల్లో ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ ఒక్కసారిగా మత్తు పదార్థాలు తగ్గించి వేయడంతో కల్లు తాగినా వారికి ఏ మాత్రం కిక్కు ఎక్కడం లేదని, ఇప్పటివరకు నాడీ వ్యవస్థ ఓ పద్ధతికి అలవాటు పడి ఉన్నందున అకస్మాత్తుగా మంచి కల్లు తాగడంతో వారిపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని, దీనివల్ల మానసిక రుగ్మతలు తలెత్తడం సహజమని, ఇలా కొంతకాలం ఉంటుందని అంటున్నారు.
First Published:  14 Sept 2015 7:47 AM IST
Next Story