Telugu Global
Others

ఫ్లై యాష్‌ లారీ బోల్తా... 18 మంది దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలోని గుండేపల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. జాతీయ రహదారిపై సిమెంట్ బూడిద లోడుతో వెళుతున్న ఈ లారీ బోల్తా పడి పోయింది. లారీ విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతోంది. లారీలో 35 మంది కూలీలు ఉన్నారు. అందులో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు 16 మందిని రక్షించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు తూర్పుగోదావరి జిల్లా […]

ఫ్లై యాష్‌ లారీ బోల్తా... 18 మంది దుర్మరణం
X
తూర్పు గోదావరి జిల్లాలోని గుండేపల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. జాతీయ రహదారిపై సిమెంట్ బూడిద లోడుతో వెళుతున్న ఈ లారీ బోల్తా పడి పోయింది. లారీ విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతోంది. లారీలో 35 మంది కూలీలు ఉన్నారు. అందులో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు 16 మందిని రక్షించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, తొంగడి అన్నవరం ప్రాంతానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి విశాఖకు ఈ లారీ సిమెంట్ బూడిద (ఫ్లై యాష్‌) లోడు తీసుకుని వెళుతోంది. ఇరవై రోజుల క్రితం పనుల కోసం వలస కూలీలు చింతలపూడికి వెళ్లారు. రాత్రి చింతలపూడి నుంచి ఏలూరు వరకు బస్సులో వచ్చిన వీరు ఏలూరు బైపాస్ వద్ద కూలీలు ఫ్లై యాష్‌తో వెళుతున్న ఈ లారీ ఎక్కారు. ఫ్లై యాష్‌ కింద కూరుకుపోయిన 16 మృతదేహాలను స్థానికులు, పోలీసులు వెలికి తీశారు. మిగిలినవి బయటకి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. గాజు శ్రీనాథ్(నాగేశ్వరపురం), బల్లపల్లి దొరబాబు(విజయపురం), గాదె దొరబాబు(శృంగవరం), కడి సూరి(విజయనగరం) వాసులుగా గుర్తించారు.మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. మృతులంతా పత్తిపాడు, తొండంగి, ప్రాంతాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. లారీ బోల్తాపడిన సమయంలో కూలీలు గాఢ నిద్రలో ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. లారీ బోల్తాపడగానే డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్‌ల కోసం గాలిస్తున్నారు.
నాయకుల దిగ్బ్రాంతి
ప్రమాద సంఘటనపై మంత్రులు, నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి చినరాజప్ప మెరుగైన వైద్య సదుపాయానికి ఆదేశించారు. మంత్రి యనమల, ఎంపీ తోట నరసింహం సంఘటన స్థలిని సందర్శించారు. యనమల రామకృష్ణుడు, పీతల సుజాత, మాణిక్యాలరావు సంఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. విపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ కూడా సంతాపం తెలిపారు.
First Published:  14 Sept 2015 3:39 AM IST
Next Story