గుజరాత్‌లో 108 మీటర్ల ధ్యానబుద్ధ!
ధ్యానం చేస్తున్నట్టుగా ఉండే బుద్ధ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచానికే తలమానికంగా నిలవాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అహ్మదాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యామ్‌లాజీ సమీపంలోని దేవ్‌నిమోరి ప్రాంతంలో దీన్ని నిర్మిస్తారు. దీని ఎత్తు 108 మీటర్లు ఉంటుంది. చైనాలో స్ప్రింగ్ టెంపుల్‌లో 153 మీటర్ల బుద్ద విగ్రహమే ప్రస్తుతం ప్రపంచంలో అతి ఎత్తయినది. తర్వాత థాయ్‌లాండ్‌లో 92 మీటర్ల విగ్రహం ఉంది. గుజరాత్‌లో నిర్మించ తలపెట్టిన 108 మీటర్ల ఎత్తు విగ్రహం ప్రపంచంలో రెండో అతి […]
BY sarvi14 Sept 2015 9:16 AM IST
X
sarvi Updated On: 14 Sept 2015 12:36 PM IST
ధ్యానం చేస్తున్నట్టుగా ఉండే బుద్ధ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచానికే తలమానికంగా నిలవాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అహ్మదాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యామ్‌లాజీ సమీపంలోని దేవ్‌నిమోరి ప్రాంతంలో దీన్ని నిర్మిస్తారు. దీని ఎత్తు 108 మీటర్లు ఉంటుంది. చైనాలో స్ప్రింగ్ టెంపుల్‌లో 153 మీటర్ల బుద్ద విగ్రహమే ప్రస్తుతం ప్రపంచంలో అతి ఎత్తయినది. తర్వాత థాయ్‌లాండ్‌లో 92 మీటర్ల విగ్రహం ఉంది. గుజరాత్‌లో నిర్మించ తలపెట్టిన 108 మీటర్ల ఎత్తు విగ్రహం ప్రపంచంలో రెండో అతి పెద్దదయిన విగ్రహం కాబోతోంది. బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్నట్టు దీన్ని రూపొందిస్తారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 700 కోట్ల రూపాయలు. 26 దేశాల ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ బౌద్ధ మహాసభలలో ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఇది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోడి కలల ప్రాజెక్టుగా దీనికి ప్రాచుర్యం కల్పించారు. యేడాదిలోగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, అర్కిటెక్ట్ ఎంపిక కూడా పూర్తయ్యిందని గుజరాత్ పవిత్ర యాత్రాధామ్ వికాస్ బోర్డు కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయాలు తెలిపారు.
Next Story