ఎప్పుడో ముఖానికి దెబ్బ తగిలితే... ఇప్పుడు దంతాల రంగు మారుతుందా..?
యాక్సిడెంట్ లో ముఖానికి దెబ్బ తగిలినప్పుడు దాని తీవ్రతను బట్టి దంతాలకు కూడా తాకిడి ఉంటుంది. దంతాలకు దెబ్బ తగలడం వల్ల ఆ పళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వంటివి సంభవించవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రభావం అప్పుడే కనిపించకపోవచ్చు. కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు, సంవత్సరాల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతుంటాయి. అప్పటి ప్రమాదం గాయాల నుంచి కోలుకున్నాం అనుకున్న తర్వాత ఎప్పటికో పళ్లు రంగు మారిపోతుంటాయి. అయితే ఇది చాలా అరుదుగానే జరుగుతుంటుంది. దీనితోపాటు […]
యాక్సిడెంట్ లో ముఖానికి దెబ్బ తగిలినప్పుడు దాని తీవ్రతను బట్టి దంతాలకు కూడా తాకిడి ఉంటుంది. దంతాలకు దెబ్బ తగలడం వల్ల ఆ పళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వంటివి సంభవించవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రభావం అప్పుడే కనిపించకపోవచ్చు. కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు, సంవత్సరాల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతుంటాయి. అప్పటి ప్రమాదం గాయాల నుంచి కోలుకున్నాం అనుకున్న తర్వాత ఎప్పటికో పళ్లు రంగు మారిపోతుంటాయి. అయితే ఇది చాలా అరుదుగానే జరుగుతుంటుంది. దీనితోపాటు ఎదురయ్యే సమస్య ఏమిటంటే… నవ్వినప్పుడు పళ్ళు వికారంగా కనపడడంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. స్పెషలిస్టును కలిస్తే చిన్న ఎక్సరే సాయంతో దంతాలు నల్లబడడానికి అసలు కారణమేంటో నిర్థారిస్తారు. పళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురయితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌తో నయం చేస్తారు. నల్లగా కనిపించే ఆ పంటి రంగును మిగిలిన పళ్ల రంగుతో కలిసిపోయేలా పంటిపైన కాంపోజిట్ వెనియరింగ్, ల్యామినేట్, క్రౌన్స్ లాంటి ఏదో ఒక పద్ధతి ద్వారా చూడడానికి దంతాలను అందంగా చేస్తారు. ఇవి మునుపటి పళ్ల లా చక్కగా ఉంటాయి. వీటితో కొరికి తినవచ్చు కూడా.