పళ్ల సెట్... సెట్ కాకపోతే!
సాధారణంగా వార్ధక్యం కారణంగా దంతాలు ఊడిపోతుంటాయి. పళ్లన్నీ ఊడిపోయినప్పుడు పళ్ల సెట్ అమర్చుకోవడం సులువైన పద్ధతి. ఇది అందరికీ అందుబాటులో ఉండే చక్కటి ప్రత్యామ్నాయం. ఈ పద్ధతిలో పైన పళ్లన్నింటికీ కలిపి ఒక ప్లాస్టిక్ సెట్, కింద పళ్లకు ఒక సెట్టు ఉంటాయి. వీటిని దవడ ఎముకలకు అమరుస్తారు. అయితే నోట్లో ఒక్క పన్ను కూడా అసలుది లేకపోవడం వల్ల ఈ సెట్‌కి తగిన పట్టు దొరకదు. వీటిని వాడేవారు మాట్లాడుతున్నప్పుడు సెట్ జారిపోతుంటే దవడ మీదకు నాలుకతో […]
సాధారణంగా వార్ధక్యం కారణంగా దంతాలు ఊడిపోతుంటాయి. పళ్లన్నీ ఊడిపోయినప్పుడు పళ్ల సెట్ అమర్చుకోవడం సులువైన పద్ధతి. ఇది అందరికీ అందుబాటులో ఉండే చక్కటి ప్రత్యామ్నాయం. ఈ పద్ధతిలో పైన పళ్లన్నింటికీ కలిపి ఒక ప్లాస్టిక్ సెట్, కింద పళ్లకు ఒక సెట్టు ఉంటాయి. వీటిని దవడ ఎముకలకు అమరుస్తారు. అయితే నోట్లో ఒక్క పన్ను కూడా అసలుది లేకపోవడం వల్ల ఈ సెట్‌కి తగిన పట్టు దొరకదు. వీటిని వాడేవారు మాట్లాడుతున్నప్పుడు సెట్ జారిపోతుంటే దవడ మీదకు నాలుకతో సర్దుకుంటూ ఉంటారు. అలాగే నమిలేటప్పుడు కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. నమిలేటప్పుడు దవడలకు గుచ్చుకుంటూ ఉంటాయి. దాంతో సరిగా నమలకుండానే మింగేస్తుంటారు. ఆహారం డెంక్చర్ ల కింద చేరిపోవడం వంటి ఇతర ఇబ్బందులూ ఉంటాయి. ఇక… ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేయడం వల్ల సరిగ్గా జీర్ణం కాదు. అలాగే ఆహారం మోతాదు తక్కువగా తీసుకోవడంతో పోషకాహార లోపంతో బలహీన పడుతుంటారు. ఇవి ఈ పళ్లతో ఎదురయ్యే అనుబంధ సమసస్యలు.
ఇంప్లాంట్స్ అమరిస్తే!!
ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీతో పై ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో పై దవడలో రెండు లేదా నాలుగు, కింద దవడలో కూడా అవససరమైన చోట్ల ఇంప్లాంట్ (దవడ ఎముకలోకి చిన్న స్క్రూతో) ఆధారంగా డెంక్చర్‌ని ఫిక్స్ చేస్తే ఆహారాన్ని చక్కగా నమిలి తినవచ్చు
-డాక్టర్ పార్ధసారథి, పార్ధ డెంటల్ హాస్పటల్స్