బీహార్‌లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు పూర్తి
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల మధ్య ఓ అంగీకారం కుదిరిందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. తమ పార్టీ 160 స్థానాలకు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) 40 స్థానాలకు, మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) 20 స్థానాల్లోను, ఆర్‌ఎస్‌ఎల్పీకి 23 స్థానాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. తొలుత మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు 15 సీట్లు కేటాయించగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయించిన స్థానాలు సరిపోలేదని […]
BY sarvi14 Sept 2015 4:28 AM
X
sarvi Updated On: 14 Sept 2015 5:14 AM
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల మధ్య ఓ అంగీకారం కుదిరిందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. తమ పార్టీ 160 స్థానాలకు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) 40 స్థానాలకు, మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) 20 స్థానాల్లోను, ఆర్‌ఎస్‌ఎల్పీకి 23 స్థానాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. తొలుత మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)కు 15 సీట్లు కేటాయించగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయించిన స్థానాలు సరిపోలేదని అలిగిన మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ వ్యవహారశైలితో ఎన్డీయేలో చీలిక వదంతులు ఏర్పడడంతో రంగంలోకి దిగిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పరిస్థితుల్ని వెంటనే చక్కదిద్దారు. గత రాత్రి మాంఝీతో సమావేశమైన అమిత్ షా హెచ్‌ఏఎంకు 20 స్థానాలు కేటాయించేందుకు అంగీకరించారు. దీంతో మాంఝీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ అమిత్ షాకు కృతజ్ఞతలు చెప్పారు. చర్చలు పూర్తయిన వెంటనే ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు కుదిరినట్లు అమిత్‌షా అధికారికంగా ప్రకటన చేశారు.
కాగా బీహార్ సీట్ల పంపిణీలో బీజేపీ వ్యవహరించిన తీరు… ఆ పార్టీ వంత పలికిన రాం విలాస్ పాశ్వాన్ వైఖరిని దుయ్యబడుతూ ఎల్జేపీ ఎంపీ రామ్ కిషోర్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాశ్వాన్ సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన కుటుంబ సభ్యులతో మాత్రమే సంప్రదిస్తున్నారని, విధేయులైన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఆయన విస్మరిస్తున్నారని విమర్శించారు. తాను లోక్‌సభలో పార్టీకి చీఫ్ విప్‌గా ఉన్నా సీట్ల సర్దుబాటు విషయం తనకు మాటమాత్రంగానైనా చెప్ప లేదని ఆయన ఆరోపించారు.
Next Story